Begin typing your search above and press return to search.

ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడు.. నటుడి సంచలన ఆరోపణ

By:  Tupaki Desk   |   13 April 2020 9:00 PM IST
ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమన్నాడు.. నటుడి సంచలన ఆరోపణ
X
కాస్టింగ్ కౌచ్.. దీని గురించి సాధారణంగా ఎక్కడ వినపడినా ఏ హీరోయిన్ ను, నటిని లైంగికంగా వేధించారని అందరూ ఆసక్తిగా తెలుసుకుంటారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లో నటీమణుల లైంగిక వేధింపులపై ‘మీటూ’ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరిగింది. చాలా మంది మగ దర్శకులు, మగ హీరోలు తమను లైంగికంగా వేధించారని ఎంతో మంది నటీమణులు గళమెత్తారు.

అయితే ఈ వేధింపులు ఆడవారికే అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. మగ నటులకు కూడా ఎదురయ్యాయని తాజాగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రముఖ టెలివిజన్ నటుడు రాజీవ్ ఖండేల్వాల్ పలు బాలీవుడ్ సినిమాలు, డిజిటల్ ఫ్టాట్ ఫామ్ లలో నటించాడు. బాలీవుడ్ లోకి రాకముందు టీవీ సీరియల్స్ లోనూ నటించి మరి పేరు తెచ్చుకున్నాడు.

అయితే తనకు ఎదురైన ఓ మేల్ కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని రాజీవ్ తెలియజేసి సంచలనం సృష్టించాడు. ఒక సీనియర్ డైరెక్టర్ తనను ఆయన కార్యాలయంలో కలవమని కోరాడని.. లైంగికంగా కోరిక తీర్చమని బలవంత పెట్టాడని.. తన చేష్టలు అర్థం చేసుకొని ఆయన ప్రతిపాదనను తిరస్కరించానని వివరించాడు. తాను ఆ ప్రతిపాదన ఒప్పుకుంటే హీరోగా అయ్యేవాడినని కానీ తిరస్కరించానని బాంబు పేల్చాడు. తరువాత చిన్న బడ్జెట్ చిత్రాలతో తాను హీరోగా ఎంట్రీ ఇచ్చానన్నాడు.

తనకు ఈ అనుభవంతో మహిళా నటులు కాస్టింగ్ కౌచ్ పేరిట పడే బాధ అర్థమైందన్నారు. అవకాశాల కోసం తాను శీలాన్ని అమ్ముకోలేదని తెలిపాడు. స్టార్ హీరో కాకున్నా టెలివిజన్ నటుడిగా పేరు తెచ్చుకున్న రాజీవ్ చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి.