Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చిన రాజీవ్

By:  Tupaki Desk   |   8 Oct 2018 2:07 PM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చిన రాజీవ్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో.. అయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత భారీగా ఉంటుందో 'అరవింద సమేత' రిలీజ్ ముందు సోషల్ మీడియా లో జరుగుతున్నహంగామా చూస్తేనే తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ ఇప్పటికే మొదలైన కౌంట్ డౌన్ ను చూస్తూ రిలీజ్ టైమ్ కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. తమ ఆరాధ్య హీరో సినిమా హిట్ అవుతుందని... రికార్డులు తిరగరాస్తుందని ఆశలు ఉన్నా.. సినిమా రిలీజ్ అయ్యి స్వయంగా వారు చూసేంత వరకూ టెన్షనే కదా?

అందుకే ఒక ఫ్యాన్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల ను ట్విట్టర్ లో "అరవింద సమేత ఎలా ఉంటుంది?" అని అడిగాడు. ఇక రాజీవ్ అందుకు "నీకు కాలర్ ఉందా.. ఎగరేసుకు తిరుగు.." అంటూ ఆన్సర్ ఇచ్చాడు. మరి తారక్ క్లోజ్ ఫ్రెండ్ ఇలాంటి కిక్కిచ్చే ఆన్సర్ ఇస్తే యంగ్ టైగర్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు కదా. ఆ ట్వీట్ చాట్ స్క్రీన్ షాట్ తీసి కాలర్ ఎగరెయ్యండి అంటూ మిగతా ఫ్యాన్స్ కు సందేశం ఇస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ మ్యానియా మళ్ళీ పీక్స్ కు చేరినట్టుగా ఉంది కదా. సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం ఇక ఎత్తిన కాలర్ ఇక దించే ప్రశ్నే లేదు. ఎందుకంటే.. ఆ తర్వాత సినిమా #RRR.. సినిమా మొదలుపెట్టినరోజు నుండి రిలీజ్ అయిన తర్వాత ఆరునెలలదాకా హంగామా ఆగదు!