Begin typing your search above and press return to search.

ఈసారి బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవ‌రు ఔట్?

By:  Tupaki Desk   |   27 Nov 2022 2:00 PM IST
ఈసారి బిగ్ బాస్ ఇంటి నుంచి ఎవ‌రు ఔట్?
X
బిగ్ బాస్ -తెలుగు షో అత్యుత్త‌మ ప్ర‌జాద‌ర‌ణ‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. వారం వారం ఇంటి స‌భ్యుల ఎలిమినేష‌న్లు చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ప్రస్తుత వారంలో బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లు కన్ఫెషన్ రూమ్ లో జరిగాయి.

హౌస్ మేట్స్ కన్ఫెషన్ రూమ్ లో ఇతరులను నామినేట్ చేసేలా బిగ్ బాస్ నిర్ధారించారు. ప్రతి వారం మాదిరిగా ఇంట్లో ఎటువంటి వాదనలు లేదా చర్చలు జరగకుండా చూసుకున్నారు. కెప్టెన్ రేవంత్ తో పాటు కీర్తి భట్ ను ఎవరూ నామినేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం. మిగిలిన ఇల్లు నామినేషన్స్ లో ఉంది.

ఈసారి ఇంటి నుంచి వైదొల‌గే స‌భ్యుడు ఎవ‌రు? అంటే.. రాజశేఖర్ అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాజశేఖర్ అండర్ డాగ్ గా వచ్చి ఆటలో బాగానే మెరుగ‌య్యాడు.

కానీ విధి వైప‌రీత్యమో ఏమో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు. మూడు వారాలుగా డేంజర్ జోన్ లోకి అడుగు పెట్టకపోయినా.. ఈ వారం నామినేషన్ల వేడిని ఎదుర్కోవాల్సి వచ్చింది. షోలో మంచి ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నా కానీ ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది.

రాజశేఖర్ ఫైమా అట్టడుగు రెండు స్థానాల్లో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. చివరకు రాజశేఖర్ ను ఇంటి నుంచి వెళుతున్నారు. మ‌రి ఈ ఫ‌లితంపై అత‌డి వెర్ష‌న్ ఏమిట‌న్న‌ది వేచి చూడాలి.