Begin typing your search above and press return to search.

రాజ‌శేఖ‌ర్ క్రేజ్ ను ప‌ట్టిన ‘ఆర్జీవీ దెయ్యం’!

By:  Tupaki Desk   |   7 April 2021 11:06 AM IST
రాజ‌శేఖ‌ర్ క్రేజ్ ను ప‌ట్టిన ‘ఆర్జీవీ దెయ్యం’!
X
సినిమాల్లో సహజంగా దెయ్యాలు మనుషులను పడతాయి.. కానీ.. ఇప్పుడు ఆర్జీవీ దెయ్యం రాజ‌శేఖ‌ర్ క్రేజ్‌ను ప‌ట్టుకుందా? అనే సందేహం వ్య‌క్తం చేస్తున్నారు సినీ జ‌నాలు! ప్ర‌స్తుతం ప‌రిస్థితులు.. ఆర్జీవీ మార్కెటింగ్ స్ట్రాట‌జీ గురించి తెలిసిన వారు ఇది నిజ‌మేన‌ని కూడా అంటున్నారు.

యాంగ్రీ యంగ్ మెన్ గా టాలీవుడ్లో త‌న‌దైన ముద్ర వేసిన రాజ‌శేఖ‌ర్‌.. ప్ర‌స్తుతం డిఫరెంట్ జోన‌ర్ల‌లో సినిమాలు ప్ర‌క‌టించి అంద‌ర‌నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నారు. ల‌లిత్ దర్శకత్వంలో ‘శేఖ‌ర్‌’ అని ఓ సినిమా ప్ర‌క‌టించారు రాజ‌శేఖ‌ర్‌. గ‌తంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రాజశేఖర్ యాభై సంవత్సరాల వ్యక్తిగా, తెల్లగడ్డం, పిల్లి కళ్లతో కనిపించారు. దీంతో.. ఈ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

రాజశేఖర్-వెంకటేష్ మహా కాంబినేషన్లో మ‌రో సినిమా తెర‌కెక్కనుంది. ఈ చిత్రానికి ‘మ‌ర్మాణువు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పేరుతోనే ప్రత్యేకత సొంతం చేసుకున్న ఈ సినిమా పోస్టర్ ను ఆ మ‌ధ్య‌ రిలీజ్ చేశారు. ఈ సినిమా చాలా భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని పోస్టర్ ద్వారానే కన్వే చేశారు. ఇవి రెండు కాకుండా.. మూడో చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా సెక్స్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని సమాచారం.

ఈ విధంగా వైవిధ్య‌మైన చిత్రాల‌ను ప్ర‌క‌టించ‌డంతో అంద‌రి దృష్టి రాజ‌శేఖ‌ర్ పై ప‌డింది. అయితే.. రాజశేఖ‌ర్ క్రేజ్ ను ఆర్జీవీ యూజ్ చేసుకోవాల‌ని చూస్తున్నాడ‌ని అంటున్నారు. గ‌తంలో రాజ‌శేఖ‌ర్ తో ‘పట్ట పగలు’ అనే హారర్ మూవీ తీశాడు వ‌ర్మ‌. కానీ.. వివిధ కార‌ణాల‌తో ఆ చిత్రం రిలీజ్ కాలేదు. అయితే.. ఇప్పుడు ఆ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి చూస్తున్నాడు వ‌ర్మ‌.

సినిమా పేరును ‘ఆర్జీవీ దెయ్యం’గా మార్చి ఏప్రిల్ 16న రిలీజ్ చేయ‌డానికి చూస్తున్నార‌ని స‌మాచారం. ఈ చిత్రంలో ఓ టీనేజ్ అమ్మాయికి తండ్రిగా న‌టించారు రాజ‌శేఖ‌ర్‌. అంతేకాదు.. ఈ సినిమాలో మేక‌ప్ లేకుండా న‌టించారు. ప్ర‌స్తుతం రాజ‌శేఖ‌ర్ క్రేజ్ పెరిగిన నేప‌థ్యంలో.. ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాడట ఆర్జీవీ. మ‌రి, ఎంత వ‌ర‌కు వ‌ర్కవుట్ అవుతుందో చూడాలి.