Begin typing your search above and press return to search.

ఈసారి పక్కా..రాజశేఖర్ విలన్ గా చూడబోతున్నాం

By:  Tupaki Desk   |   17 Jun 2016 10:53 AM IST
ఈసారి పక్కా..రాజశేఖర్ విలన్ గా చూడబోతున్నాం
X
ఒకప్పటి హీరోలందరూ విలన్లుగానో.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో మారిపోతున్న సమయం ఇది. జగపతి బాబు లాంటి టాప్ హీరో విలన్ గా టర్న్ తీసుకుని మంచి రేంజికి వెళ్లాడు. ఐతే ఒకప్పటి యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ మాత్రం హీరో వేషాలు వదిలేసే విషయంలో చాలా బెట్టు చేశాడు. పూర్తిగా మార్కెట్ పోయే వరకు వెయిట్ చేశాడు. ఎట్టకేలకు ఈ ఏడాది ఆయన విలన్ వేషాల్లోకి మారడానికి అడుగేశాడు. ఐతే తేజ దర్శకత్వంలో ‘అహం’ సినిమా చేసే ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారింది. తేజతో తేడాలు రావడంతో రాజశేఖర్ ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఐతే ఆ ఛాన్స్ పోయినా.. ఇప్పుడో బంపర్ ఆఫర్ రాజశేఖర్ తలుపు తట్టినట్లు చెబుతున్నారు.

లక్ష్యం.. లౌక్యం.. తర్వాత గోపీచంద్-శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటిస్తాడని సమాచారం. ఇప్పటికే దర్శకుడు శ్రీవాస్.. రాజశేఖర్ కు క్యారెక్టర్ నరేట్ చేయడం.. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఈ సినిమాకు రాజశేఖర్ మంచి పారితోషకమే పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. కెరీర్ ఆరంభంలో కొన్ని నెగెటివ్ రోల్స్ చేశాక.. హీరోగానే కొనసాగిన రాజశేఖర్ దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత మళ్లీ విలన్ అవతారమెత్తుతుండటం విశేషమే. హీరోగా రాజశేఖర్ చివరి సినిమా ‘గడ్డం గ్యాంగ్’ ఆయనకు దారుణమైన అనుభవాన్ని మిగిల్చింది. తమిళం నుంచి ఓ కథను అరువు తెచ్చుకుని సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తే.. మొత్తం పెట్టుబడి అంతా పోయింది.