Begin typing your search above and press return to search.

చంద్రబాబు పాత్రలో ఆ హీరోనా..

By:  Tupaki Desk   |   2 April 2018 11:21 AM IST
చంద్రబాబు పాత్రలో ఆ హీరోనా..
X
బాలీవుడ్ లో బయోపిక్ లు ఎక్కువగా వస్తున్నాయేంటి అనుకుంటున్నా సమయంలో సౌత్ లో కూడా అదే తరహాలో వస్తుండడం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా టాలీవుడ్ లో తెలుగు ప్రముఖుల చరిత్రలను మనవారు చాలా అందంగా తెరకెక్కించే విధంగా అడుగులు వేస్తున్నారు. అది కూడా రాజకీయలకు సంబంధమున్న కథలను ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బాలకృష్ణ తన తండ్రి కథను తెరపై చూపించడానికి సిద్దమైన సంగతి తెలిసిందే.

ఎన్నో మలుపులు తిరిగిన నందమూరి తారకరామా రావు గారి జీవితం ఎలా ప్రజెంట్ చేస్తారా అనేది ఇప్పుడున్న ప్రధానాంశం. అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఎన్టీఆర్ బయోపిక్ లో అతి కీలకమైన క్యారెక్టర్ ఏదైనా ఉందా అని అంటే.. చంద్రాబాబు క్యారెక్టర్ అని అకందరికి తెలిసిన విషయమే. అయితే ఆ పాత్ర ప్రజెంటేషన్ ఎలా ఉంటుందా అనేదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అంతే కాకుండా ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారు అనేది కూడా ఆసక్తి నెలకొంది.

అయితే చంద్రబాబు పాత్రకు హీరో రాజశేఖర్ ని ముందుగా సెలెక్ట్ చేసినట్లు సమాచారం. బాలయ్యకు చంద్రబాబుకు గత కొంత కాలంగా స్నేహం చాలా పెరిగిపోయింది. గరుడ వేగ వేడుకలకు బాలయ్య రావడం అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లాంచ్ అయినప్పుడు రాజశేఖర్ రావడం చూస్తూనే ఉన్నాం. అంత సాన్నిహిత్యం ఉండడంతో బాలయ్య చంద్రబాబు పాత్ర కోసం అడిగినట్లు తెలుస్తోంది. కానీ రాజశేఖర్ ఒప్పుకోలేదని టాక్ వస్తున్నా అది ఎంతవరకు నిజమో తెలియదు. మరి చంద్రబాబు పాత్రను రాజశేఖర్ చేస్తే ఎలా ఉంటుందో..?