Begin typing your search above and press return to search.

గరుడ వేగ.. ఆయనింట్లో పెళ్లి లాంటిదట

By:  Tupaki Desk   |   23 Sept 2017 9:38 AM IST
గరుడ వేగ.. ఆయనింట్లో పెళ్లి లాంటిదట
X
సీనియర్ హీరో రాజశేఖర్ చివరగా నటించిన ‘గడ్డం గ్యాంగ్’ వచ్చిన సంగతి తెలియదు. వెళ్లిన సంగతి తెలియదు. దాని కంటే ముందు ఆయన నటించిన సినిమాలు కూడా దారుణమైన ఫలితాన్ని చవిచూశాయి. గత దశాబ్ద కాలంలో రాజశేఖర్ కెరీర్ బాగా దెబ్బ తినేసింది. ‘గడ్డం గ్యాంగ్’తో రాజశేఖర్ కెరీర్ దాదాపు ముగిసినట్లే అనుకున్నారు. కానీ ఈ సీనియర్ హీరో మళ్లీ బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీకి రెడీ అయ్యాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఆయన నటించిన ‘గరుడ వేగ’ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలిగింది. ఏం నమ్మకమో ఏంటో కానీ.. ఈ సినిమాపై ఏకంగా రూ.25 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు చెబుతున్నారు. ఈ విషయమై రాజశేఖర్ సైతం ఆశ్చర్యపోయాడు.

ఈ చిత్ర టీజర్ లాంచ్ సందర్భంగా రాజశేఖర్ చాలా ఉద్వేగంగా మాట్లాడాడు. ‘గరుడ వేగ’ తన కెరీర్లో మరపు రాని సినిమా అన్నాడు. ఈ చిత్రాన్ని తన ఇంట్లో ఒక పెళ్లి లాగా భావిస్తానని.. పెళ్లి జరిగితే శ్రేయోభిలాషులందరినీ పిలిచినట్లుగానే.. ఈ సినిమాకు ప్రేక్షకుల్ని ఆహ్వానిస్తానని.. ఈ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడానికి తాను చేయాల్సిందల్లా చేస్తానని అన్నాడు రాజశేఖర్. ఇక ప్రవీణ్ సత్తారు తనకు ‘గరుడ వేగ’ కథ చెప్పినపుడు.. చాలా బాగా అనిపించిందని.. కానీ ఈ కథను అతను ఎలా డీల్ చేస్తాడో అని సందేహించానని.. కానీ షూటింగ్ మొదలయ్యాక మాత్రం అతడి పని తీరుకు ముగ్ధుడైపోయానని రాజశేఖర్ అన్నాడు.