Begin typing your search above and press return to search.

అల్లరి ప్రియుడు అహం వదల్లేదంట

By:  Tupaki Desk   |   10 April 2016 10:35 AM IST
అల్లరి ప్రియుడు అహం వదల్లేదంట
X
యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్ తో పాటు, అల్లరి ప్రియుడుతో వచ్చిన లవర్ బోయ్ కేరక్టర్ ఇచ్చిన జోష్ తో.. ఇన్నేళ్లు కెరీర్ నెట్టుకొచ్చాడు రాజశేఖర్. పాతికేళ్ల నుంచి హీరో కేరక్టర్లు వేసిన రాజశేఖర్.. మళ్లీ తేజ 'అహం'తో విలన్ గా మారేందుకు అంగీకరించాడు.

అయితే 2-3 రోజుల షూటింగ్ తోనే దర్శకుడు తేజకు, రాజశేఖర్ కు తేడాలొచ్చాయనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. టైం టు టైం పనిచేసుకెళ్లే తేజకు, టైం అనే మాటను కూడా పట్టించుకోని రాజశేఖర్ కు పడ్డం లేదని అన్నారు. దీంతో విలన్ రోల్ నుంచి రాజశేఖర్ నుంచి తప్పించేసి, వేరే నటుడుని తీసుకునేందుకు తేజ ప్రయత్నిస్తున్నాడని అన్నారు. వీటికి రాజశేఖర్ స్పందించాడు.

'నేను కూడా ఈ మాటలు విన్నాను. అసలు ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉన్న సినిమా.. షూటింగ్ ఎలా స్టార్ట్ చేసుకుంటుంది.. ఇప్పటికీ దీనిపై తేజతో మాట్లాడి, స్టోరీ డెవలప్ మెంట్ సంగతే చూస్తున్నాం.' అని చెప్పాడు రాజశేఖర్. ఇలాంటివి పబ్లిష్ చేసే ముందు తననో, డైరెక్టర్ నే అడగాలిగా అని క్వశ్చన్ చేస్తున్నాడు విలన్ రాజశేఖర్.