Begin typing your search above and press return to search.

'మా' ప‌ద‌వికి రాజ‌శేఖ‌ర్ రాజీనామా

By:  Tupaki Desk   |   2 Jan 2020 1:09 PM GMT
మా ప‌ద‌వికి రాజ‌శేఖ‌ర్ రాజీనామా
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) లుక‌లుక‌లు ప‌దే ప‌దే ర‌చ్చ‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. నేడు మా డైరీ-2020 ఆవిష్క‌ర‌ణ‌లో మ‌రోసారి పెద్ద‌ల సాక్షిగా లుక‌లుక‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ వేదిక‌పై జ‌రిగిన ర‌చ్చ అనంత‌రం తాను మా ఉపాధ్య‌క్ష‌ ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నాన‌ని హీరో రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు.

2019 మార్చిలో జరిగిన మా ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్ పై నరేష్ ప్యానెల్ గెలిచిన విషయం తెలిసిందే. దీంతో నరేష్ అధ్యక్షుడిగా.. రాజశేఖర్ ఉపాధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. అయితే ప్ర‌మాణ స్వీకారం రోజునే గొడ‌వ‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. గురువారం జరిగిన డైరీ ఆవిష్కరణలో అవి తారాస్థాయికి చేరాయి. దీంతో మనస్తాపంతో హీరో రాజశేఖర్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్బంగా రాజ‌శేఖ‌ర్ రాసిన లేఖ‌లో ప‌లు విష‌యాల్ని ప్ర‌స్థావించారు.

అధ్య‌క్షుడు న‌రేష్ తో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రాజ‌శేఖ‌ర్ కి ఎంత‌మాత్రం స‌రిప‌డ‌డం లేద‌ని దీనిని బ‌ట్టి అర్థ‌మైంది. మాలో విభేధాలు య‌థాత‌థంగా కొన‌సాగుతున్న సంగ‌తిని స్వ‌యంగా రాజ‌శేఖ‌ర్ వెల్ల‌డించారు. మాలో గొడ‌వ‌లు ఉన్నాయి. ఈ స‌మ‌స్య అప‌రిష్కృతంగా ఉంద‌ని.. త‌న‌ని చాలాసార్లు అవ‌మానించినా ఎంతో ఓపిగ్గా ప‌ద‌విలో కొన‌సాగాన‌ని రాజ‌శేఖ‌ర్ తాజాగా మా అసోసియేష‌న్ కి పంపిన రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. తాను ప‌ద‌విలో కొన‌సాగ‌లేక రాజీనామా చేస్తున్నాన‌న‌ని తెలిపారు. న‌రేష్ వ‌ల్ల మూవీ ఆర్టిస్టులు గౌర‌వం కోల్పోతున్నా తాను కాపాడే ప్ర‌య‌త్నం చేశాన‌ని రాజ‌శేఖ‌ర్ ఈ లేఖ‌లో పేర్కొన్నారు.