Begin typing your search above and press return to search.

7 నిమిషాల ఫైట్‌.. సింగిల్ టేక్ లో

By:  Tupaki Desk   |   6 Jan 2019 6:23 AM GMT
7 నిమిషాల ఫైట్‌.. సింగిల్ టేక్ లో
X
కొంద‌రిని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటూ పొగిడేస్తుంటారు. ఎంత పెద్ద సీన్ ని అయినా, ఎంత పెద్ద డైలాగ్ ని అయినా ఒకే టేక్‌లో పూర్తిచేస్తే అత‌డికి ఆన్ లొకేష‌న్ క్లాప్స్ ప‌డ‌తాయి. అలా ఎన్నోసార్లు ఎంద‌రో స్టార్లు త‌మ ప్ర‌తిభా పాట‌వం చూపించారు కాబ‌ట్టే, పెద్ద స్టార్లుగా ఎదిగారు. న‌టించ‌మంటే జీవించే ఆర్టిస్టులే మ‌న‌కు ఎక్కువ‌.

మ‌న స్టార్ హీరోల్లో సీనియ‌ర్ హీరోలంతా ఈ త‌ర‌హా ప్ర‌తిభ‌ను చూపించారు. `పీఎస్ వీ గ‌రుడ వేగ` లాంటి చిత్రంలో సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ యాక్ష‌న్ కి అంతే గొప్ప పేరొచ్చింది. ఆ సినిమా కోసం డూప్ లేకుండా పైట్స్ చేశారాయ‌న‌. సింగిల్ టేక్ ఆర్టిస్టుగా ప‌లు స‌న్నివేశాల్లో న‌టించారు.ఎన్ఐఏ అధికారిక‌గా ఫెంటాస్టిక్ పెర్ఫామెన్స్ తో ఆక‌ట్టుకున్నారు. ఈసారి కూడా అలాంటి ఫీట్ ని రాజ‌శేఖ‌ర్ రిపీట్ చేస్తున్నార‌ట‌. ఇంకా చెప్పాలంటే అంత‌కుమించి చేశార‌ట.

ప్ర‌స్తుతం డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో `క‌ల్కి` ఆన్ సెట్స్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం ఓ కీల‌క‌మైన యాక్ష‌న్ ఎపిసోడ్ ని ఇటీవ‌ల‌ చిత్రీక‌రించార‌ట‌. ఏడు నిమిషాల పాటు ఎలాంటి గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా ఒక‌టే ఫైట్ సీన్. అందులో రాజ‌శేఖ‌ర్ సింగిల్ టేక్ లో ఎలాంటి గ్యాప్ లేకుండా న‌టించి మెప్పించార‌ట‌. ఆ క్ష‌ణం ఊపిరిస‌ల‌ప‌నంత‌గా.. ఆన్ లొకేష‌న్ క్లాప్స్ ప‌డ్డాయ‌ని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ డేర్ డెవిల్ స్టంట్స్ ఆద్యంతం కుర్చీ అంచుమీద కూచోబెడ‌తాన్న టాక్ వినిపిస్తోంది. ఏడు నిమిషాల యాక్ష‌న్ ఎపిసోడ్ ని సింగిల్ టేక్ లో పూర్తి చేయ‌డం అంటే అదేమంత సులువేం కాదు.

రాజ‌శేఖ‌ర్ ఎంతో డెడికేష‌న్ ఉన్న స్టార్ కాబ‌ట్టే ఇది సాధ్య‌మైంద‌ని యూనిట్ స‌భ్యులు తెగ పొగిడేస్తున్నార‌ట‌. అ! లాంటి థ్రిల్లర్ మూవీతో ప్ర‌యోగం చేసి విజ‌యం అందుకున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సారి రాజ‌శేఖ‌ర్ ని త‌న కెరీర్ బెస్ట్ గా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ట ఈ యంగ్ డైరెక్ట‌ర్. మొత్తానికి రాజ‌శేఖ‌ర్ కి స‌రైనోడు త‌గిలాడ‌ని టాక్ వినిపిస్తోంది. `క‌ల్కి` తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ నేప‌థ్యం ఉన్న చిత్రం. అందుకు త‌గ్గ ఆహార్యంతో రాజ‌శేఖ‌రుడు మైమ‌రిపిస్తాడ‌ట‌.