Begin typing your search above and press return to search.

ఆక‌ర్షిస్తున్న‌ రాజశేఖర్ కొత్త ప్రయాణం..!

By:  Tupaki Desk   |   26 March 2021 11:30 PM GMT
ఆక‌ర్షిస్తున్న‌ రాజశేఖర్ కొత్త ప్రయాణం..!
X
సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ వెండితెర‌పై కొత్త ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. ప్ర‌స్తుతం ఆయ‌న మూడు చిత్రాల‌ను అనౌన్స్ చేశారు. ఈ మూడూ వేటిక‌వే ప్ర‌త్యేకం. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు స‌రిగా వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో.. డిఫ‌రెంట్ జోన‌ర్ల‌ను ఎంచుకుంటున్నారీ హీరో. త‌ద్వారా.. మిగిలిన పెద్ద‌ హీరోల‌క‌న్నా భిన్నంగా ట్రై చేస్తున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ల‌లిత్ దర్శకత్వంలో ‘శేఖ‌ర్‌’ ఓ సినిమా ప్ర‌క‌టించారు రాజ‌శేఖ‌ర్‌. శివాని, శివాత్మిక‌, వెంక‌ట్ శ్రీనివాస్ బొగ్గ‌రం, స‌త్యానారాయ‌ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గత నెలలో ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రాజశేఖర్ యాభై సంవత్సరాల వ్యక్తిగా, తెల్లగడ్డం, పిల్లి కళ్లతో కనిపించారు. దీంతో.. ఈ లుక్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ సినిమా ద్వారా స‌మ్ థింగ్ డిఫ‌రెంట్ గా ఏదో చేయ‌బోతున్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. రాజశేఖర్ 91వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇక‌, ఇలాంటిదే మ‌రో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశారు. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’, ‘ఉమా మహేశ్వ‌ర ఉగ్ర‌రూపస్య‌’ వంటి స్పెషల్ జోనర్లో చిత్రాలను తెరకెక్కించిన వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాజశేఖర్-వెంకటేష్ మహా కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రానికి ‘మ‌ర్మాణువు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పేరుతోనే ప్రత్యేకత సొంతం చేసుకున్న ఈ సినిమా పోస్టర్ ను నిన్న రిలీజ్ చేశారు. దర్శకుడు పుట్టిన రోజు సందర్భంగా రివీల్ చేసిన ఈ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. దర్శకుడి గత చిత్రాలకన్నా మరింత భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందని పోస్టర్ ద్వారానే కన్వే చేశారు. ఈ సినిమాను శివాని, శివాత్మిక, విజయ ప్రవీణ పరుచూరి నిర్మిస్తుండగా.. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇవి రెండు కాకుండా.. మూడో చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా సెక్స్ ట్రాఫికింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందని సమాచారం. ఆ విధంగా.. రాజశేఖర్ మూడో చిత్రం కూడా వైవిధ్యంగా రూపొందనుందని అర్థమవుతోంది. ఇలా.. రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు దూరంగా.. త‌న సీనియారిటీకి ద‌గ్గ‌ర‌గా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నారని అభినందిస్తున్నారు. ఇందులో ఏ ఒక్క‌టి స‌క్సెస్ అయినా.. రాజ‌శేఖ‌ర్ నుంచి మ‌రిన్ని వైవిధ్య‌మైన చిత్రాలు వ‌స్తాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.