Begin typing your search above and press return to search.

'మర్మాణువు' అనే డిఫరెంట్ టైటిల్‌ తో వస్తున్న యాంగ్రీ మ్యాన్..!

By:  Tupaki Desk   |   25 March 2021 4:35 PM GMT
మర్మాణువు అనే డిఫరెంట్ టైటిల్‌ తో వస్తున్న యాంగ్రీ మ్యాన్..!
X
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఈ మధ్య వరుసపెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తన కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించారు. ''మర్మాణువు'' అనే డిఫరెంట్ టైటిల్‌ ని తన సినిమాకి ఖరారు చేసినట్లు వెల్లడించారు. 'కేరాఫ్ కంచరపాలెం' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పెగాసస్ సినీ కార్పొరేషన్ ఎల్ఎల్‌పి - మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ శివాణి - శివాత్మిక‌ - విజయ ప్రవీణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఈరోజు డైరెక్టర్ వెంకటేష్ మహా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'మర్మాణువు' టైటిల్ పోస్టర్ ఆసక్తికరంగా వుంది. ఓ పుర్రె బొమ్మకు ఇంద్రజాలికుడు గెటప్ వేసినట్లు ఈ పోస్టర్ ఉంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ''వెంకటేష్ మహా అద్భుతమైన కథ చెప్పారు. సినిమాకు పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది. కథ, కథనాలు అన్ని భాషల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభిస్తాం అనేది త్వరలో వెల్లడిస్తాం'' అని తెలిపారు.