Begin typing your search above and press return to search.

ఆలీ విషయంలో రాజశేఖర్ ఫీలయ్యాడట

By:  Tupaki Desk   |   11 Nov 2017 3:58 PM IST
ఆలీ విషయంలో రాజశేఖర్ ఫీలయ్యాడట
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి ఎపిసోడ్ లో తన హావభావాల్ని కామెడీగా చూపించడం.. తనను ఇమిటేట్ చేస్తూ పవన్ సెటైర్లు వేయడం గురించి రాజశేఖర్ గతంలోనే చాలా ఫీలయ్యాడు. దీనిపై ఒకటికి రెండుసార్లు తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మరోసారి ఆ టాపిక్ గురించి మాట్లాడారు. పవన్ అలా చేయడమే బాధాకరమంటే.. ఆ సీన్లో ఆలీ కూడా ఉండటం తనను మరింత బాధ పెట్టిందని ఆయన చెప్పాడు. తనకు సన్నిహితుడైన ఆలీ ఆ సన్నివేశంలో నటించడంతో తాను ఫీలయ్యానని రాజశేఖర్ అన్నాడు.

పవన్ కళ్యాణ్ అలాంటి సీన్ చేయాలని అనుకున్నపుడు ఆలీ వద్దు అని చెప్పి ఉండాల్సిందని రాజశేఖర్ అభిప్రాయపడ్డాడు. ఆలీ తనకు క్లోజ్ అని.. ఆ సీన్ వద్దని అతను అనాల్సిందని.. అలా కుదరని పక్షంలో కనీసం తననైనా ఆ సీన్ నుంచి తప్పించమని ఆలీ అడిగి ఉంటే బాగుండేదని రాజశేఖర్ అన్నాడు. కానీ ఆలీ ఆ సీన్ చేయడం బాధ కలిగించిందని.. తనను ఆలీ కలిసినపుడు ఈ విషయం అడుగుదామని కూడా అనుకున్నానని.. అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకని వదిలేశానని రాజశేఖర్ వెల్లడించాడు. రాజశేఖర్ కొత్త సినిమా ‘గరుడవేగ’లో ఆలీ కూడా ఓ చిన్న పాత్ర చేసిన సంగతి తెలిసిందే. గతంలో వీళ్లిద్దరూ చాలా సినిమాల్లో కలిసి నటించారు.