Begin typing your search above and press return to search.

ఆ యాక్సిడెంట్‌ పై హీరో క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Nov 2018 4:15 PM GMT
ఆ యాక్సిడెంట్‌ పై హీరో క్లారిటీ
X
సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ గ‌త కొంత‌కాలంగా `క‌ల్కి` షూటింగ్‌ తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌ లో రాజ‌శేఖ‌ర్‌ కు యాక్సిడెంట్ జ‌రిగింద‌ని .. తీవ్రంగా గాయ‌ప‌డ్డార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే ఇందులో నిజం ఎంతో తెలియ‌క హైద‌రాబాద్‌ లో అత‌డి స‌న్నిహితులు - అభిమానులు చాలానే టెన్ష‌న్ ప‌డ్డారు. దీంతో త‌న‌పై వ‌చ్చిన వార్త‌ల‌పై స్పందించిన రాజ‌శేఖ‌ర్ స్వ‌యంగా వివ‌ర‌ణ ఇచ్చారు.

``ప‌దిరోజుల క్రితం జ‌రిగిన ఘ‌ట ఇది. క‌ల్కి సెట్స్‌ లో ఓ స్టంట్ సీన్ తెర‌కెక్కిస్తున్న‌ప్పుడు గాయ‌పడిన మాట వాస్త‌వం. దెబ్బ‌లు త‌గిలినా కానీ విరామం తీసుకోలేదు. అందుకు కార‌ణం .. ఎంద‌రో న‌టీన‌టుల కాల్షీట్లతో ఇబ్బంది ఉంది. అందుకే నేను గాయాల‌తోనే షూటింగ్‌ కి స‌హ‌క‌రించాను. ఇప్పుడు నెమ్మ‌దిగా కోలుకుంటున్నా. ఆరోగ్యం బాగానే ఉంది. కొంత కోలుకున్న తర్వాత‌ కులుమ‌నాలి షూటింగ్ కోసం నేను కుటుంబ స‌మేతంగా వెళుతున్నాను. ఈ జ‌ర్నీలో ఓచోట‌ అనుకోని రీతిలో మార్గం మధ్యలో బురద నేల‌లోకి వాహ‌నం దిగ‌బ‌డ‌డంతో ఆటంకం క‌లిగింది. కానీ ఎవ‌రికీ ఏమీ కాలేదు. అంద‌రూ క్షేమంగానే ఉన్నారు. కులుమ‌నాలీ లాంటి అంద‌మైన చోట చిత్రీక‌ర‌ణ కోసం ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నాను. నాకు ఎన్నో ఫోన్‌లు వ‌స్తున్నాయి. సంక్షిప్త సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ స‌భ్యులు - స్నేహితులు - అభిమానుల నుంచి ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. మీ అంద‌రి ప్రేమ‌కు ధ‌న్య‌వాదాలు. మేము క్షేమం. త‌ప్పుడు రూమ‌ర్లు వ్యాప్తి చేయ‌వ‌ద్దు`` అని రాజ‌శేఖ‌ర్ అన్నారు.

`పీఎస్‌ వి గ‌రుడవేగ` లాంటి బ్లాక్‌ బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రో ఛాలెంజింగ్ స్క్రిప్టుతో రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రం చేస్తున్నార‌ని తెలుస్తోంది. అ! ఫేం ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 1980ల కాలంలో నైజాం బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే క‌థాంశ‌మిద‌ని తెలుస్తోంది. ఇందులో రాజ‌శేఖ‌ర్ మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడిగా న‌టిస్తున్నారు. ఎమోష‌న్‌ - యాక్ష‌న్‌ కి పెద్ద పీట వేసే చిత్ర‌మిద‌ని చిత్ర‌యూనిట్ చెబుతోంది.