Begin typing your search above and press return to search.

ఉత్తరాది భామగా రాజశేఖర్ కూతురు

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:30 AM GMT
ఉత్తరాది భామగా రాజశేఖర్ కూతురు
X
సీనియర్ హీరో రాజశేఖర్.. మాజీ హీరోయిన్ జీవితల కూతురు శివాని సినిమా ఎంట్రీ ఖాయమని ముందే తెలిసిపోయింది. ఈ చిన్నది సినిమాల్లో సత్తా చాటేందుకు ఫిక్స్ అవగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లభించింది. రీసెంట్ గా న్యూఇయర్ పార్టీ పెట్టి - ప్రముఖులను ఆహ్వానించి మరీ ఏర్పాట్లను తుది దశకు చేర్చినట్లు చెప్పారట రాజశేఖర్.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పార్టీకి వచ్చి శివానిని ఆశీర్వదించిన సంగతి తెలిసిందే. అయితే.. శివాని ఎంట్రీ ఇవ్వబోయే సినిమా ఏదనే విషయంపై ఇప్పుడు క్లారిటీ వస్తోంది. బాలీవుడ్ మూవీ 2స్టేట్స్ ను తెలుగులో రీమేక్ చేయనుండగా.. ఏడాదిగా మంచి ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తోన్న రాజశేఖర్ అండ్ టీం.. ఈ ప్రాజెక్టుకు ఒప్పుకున్నారని.. ఇప్పటికే శివానితో అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ మూవీని తెలుగు ఆడియన్స్ కు తగినట్లుగా మార్చగా.. తెలుగు వెర్షన్ లో హీరో తెలుగు అబ్బాయిగా కనిపించనున్నాడట. హీరోయిన్ శివాని నార్త్ ఇండియన్ భామగా కనిపించనుందని తెలుస్తోంది.

మొదట తమళనాడు వాసిగా చూపించాలని భావించగా.. ఈ కథ ప్రకారం హీరో-హీరోయిన్లు రెండు విభిన్న సంస్కృతులు కలిగిఉండాలి. అందుకే హీరోయిన్ పాత్రను నార్త్ ఇండియన్ గా ఫిక్స్ చేశారట. అలా ఉత్తరాది భామగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది శివాని.