Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: బాత్ టబ్ లో హీరో కూతురు

By:  Tupaki Desk   |   2 May 2018 1:18 PM GMT
ఫోటో స్టోరి: బాత్ టబ్ లో హీరో కూతురు
X
సినిమా ఇండస్ట్రీలో కథానాయికగా క్రేజ్ అందుకోవాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఎంత అందంగా ఉన్నప్పటికీ కొంత మందికి అనుకున్నంతగా క్రేజ్ అందదు. సరైన ప్రాజెక్ట్ దక్కి అది హిట్ అయితే అభిమానుల నుంచి సపోర్ట్ దక్కుతుంది. అలాగే కొంచెం గ్లామర్ అందాలతో మెరిస్తే ఈ తరం కురాళ్లలో ఓ వర్గం వారు ఇంప్రెస్ అవుతున్నారు. రెగ్యులర్ గా అలాంటి కొత్త హీరోయిన్స్ చాలా మంది వస్తుంటారు.

కానీ సినిమా పరిశ్రమలోని నటీనటుల ఫ్యామిలీ నుంచి అలాంటి హీరోయిన్స్ రావడం అనేది చాలా రేర్. బాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది నటుల గారాల కూతుళ్లు గ్లామర్ పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీనిస్తున్నారు. అలాగే కోలీవుడ్ లో కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ గ్లామర్ పాత్రలను చేస్తోంది. అదే తరహాలో ఇప్పుడు రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా తెగ ట్రై చేస్తోంది.

శివాత్మిక ఎలా కనిపించినా కూడా గ్లామర్ హీరోయిన్ అనేలా చెప్పకనే చెబుతోంది. తన ప్రతి ఫొటో షూట్ లో అద్దం పట్టేలా ఆ విషయం ఈజీగా అర్ధమవుతోంది. రీసెంట్ గా ఇచ్చిన ఫొటో షూట్ లో కూడా శివాత్మిక వెరైటీ లుక్స్ తో స్టైలిష్ గా కనిపించింది. బ్లాక్ శారీలో బాత్ టబ్ లో ఆమె ఇచ్చిన స్టిల్ చూసి అభిమానులు ప్రశంసల జల్లును కురిపిస్తున్నారు. అలాగే హీరోయిన్ అయ్యే లక్షణాలు చాలానే ఉన్నాయంటూ మరికొంత మంది ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.