Begin typing your search above and press return to search.

రాజశేఖర్ కూతురు.. ఫోటో షూట్ టాక్

By:  Tupaki Desk   |   30 May 2017 6:37 AM GMT
రాజశేఖర్ కూతురు.. ఫోటో షూట్ టాక్
X
సీనియర్ హీరో రాజశేఖర్- మాజీ హీరోయిన్ జీవితల కూతురు శివాని. ఈమె సినిమాల్లోకి వస్తోందంటూ చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. అయితే.. వీటిపై తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. శివాని హీరోయిన్ అవుతుందని కానీ.. కాదు అని కానీ చెప్పలేదు. దీంతో ఈ టాక్ మరింతగా పెరిగిపోగా.. రీసెంట్ గా శివానితో ఓ ఫోటో షూట్ చేయడం హాట్ టాపిక్ అయిపోయింది.

తాజాగా ఈమె చెన్నైలో ఓ సూపర్బ్ ఫోటో షూట్ చేసింది. కెమేరా ముందు ఈమె లుక్స్ ఎలా ఉంటాయో చెప్పేందుకు ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ తో ఈ షూట్ చేయించాక.. తమిళ్ ఇండస్ట్రీలో పలువురు ఫిలిం మేకర్స్ కు చూపించారని తెలుస్తోంది. ఇందులో దిగ్గజ దర్శకుడు మణిరత్నం కూడా ఉండగా.. టాలీవుడ్ లో కూడా పలువురు దర్శకుల చేతికి శివాని ఫోటో షూట్ చేరింది. రాజశేఖర్ ఫ్యామిలీకి సన్నిహితులు అయిన దర్శకుడు తేజ కూడా శివాని ఫోటో షూట్ కు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పలు మహిళా ప్రాధాన్యత ఉండే సబ్జెక్టులతో జీవితను అప్రోచ్ అయారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. జీవిత రాజశేఖర్ లకు సుదీర్ఘ కాలంగా సన్నిహితంగా ఉన్న ఓ టాప్ తమిళ్ యాక్టర్ మూవీతో శివాని సినిమా కెరీర్ లాంఛ్ చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/