Begin typing your search above and press return to search.

ఇలా అయితే ఎంట్రీ హిట్టే..

By:  Tupaki Desk   |   10 March 2018 4:26 AM GMT
ఇలా అయితే ఎంట్రీ హిట్టే..
X

హీరోయిన్స్ కావాలంటే అమ్మాయిలకు ఉండే ఒక ఒక్క రికమండేషన్ అందం. అదే వారికి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అలాంటి హీరోయిన్సే ఓ పదేళ్ల వరకు ఇండస్ట్రీలో ఉండగలరు. ఇప్పుడు చాలా మంది సినీ తారల ఇళ్ల నుంచి కూడా చాలా మంది భామలు వెండితెరను ఏలడానికి సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు హీరోయిన్స్ కూతుర్లు పెద్దగా ఇండస్ట్రీలో కనిపించే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.

చాలా మంది స్టార్ హీరోల కూతుళ్లు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే.. హీరో రాజశేఖర్ పెద్ద కూతురు ఎంట్రీ కూడా ఓ వర్గం వారిలో ఆసక్తిని రేపుతోంది. తల్లి జీవిత సహకారంతో కొంచెం నటనలో రాటు దేలుతోన్న శివాని వెండితెరపై అలరించడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు. ఎందుకంటే ఆమె అందం ఇప్పుడు చాలా మందిని ఆకర్షిస్తోంది.

రీసెంట్ గా జరిగిన ఓ పెళ్లిలో శివాని లంగా వోణి లో కనిపించి అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది. ఈ మధ్యనే ఈ చిన్నది '2 స్టేట్స్' తెలుగు రీమేక్ లో అడివి శేష్‌ పక్కన హీరోయిన్ గా చేయడానికి సిద్దపడిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ అక్కడ సినిమాలో ఎలా చేస్తోందో తెలియదు కాని.. ఈ గ్లామర్ లుక్ చూస్తుంటే మాత్రం.. రేపు తెరమీద ఏదో మాయ చేస్తుందేమో అనే తరహాలోనే ఉంది.