Begin typing your search above and press return to search.

ఒక హీరో కూతురు.. ఒక ప్రొడ్యూసర్ కొడుకు

By:  Tupaki Desk   |   27 July 2017 4:50 AM GMT
ఒక హీరో కూతురు.. ఒక ప్రొడ్యూసర్ కొడుకు
X
తెలుగు సినిమాలో హీరో కొడుకులు హీరో అవ్వడం సర్వసాధారణం. కానీ హీరో కూతుర్లు హీరోయిన్ అవ్వడమే ఇప్పుడు కొత్త ట్రెండ్. ఈ ట్రెండ్ కి మెగా డాటర్ నిహారిక బీజం వేసిన ఇప్పుడు మరో హీరో కూతురు హీరోయిన్ దానికి ముందుకు తీసుకొని వెళ్తుంది. దాని కోసం ఆమె ఒక టాలెంట్ ఏజెన్సీ ను కూడా సంప్రదించి ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఆమె సినిమా తెరకు పరిచయం అవ్వడం తద్యం అని ఇప్పటికే కొన్ని వార్తలు వచ్చిన ఏ సినిమా తో అవుతుందో ఒక నిర్ణయానికి రాలేదు.

రాజశేఖర్ – జీవిత కూతురు శివాని ఇప్పుడు ఫేమస్ తెలుగు స్టార్ కిడ్ అయ్యింది. ఎందుకంటే త్వరలో ఈమె హీరోయిన్ కాబోతుంది. 2016 లో వచ్చిన పెళ్ళిచూపులు సినిమా నిర్మాత రాజ్ కందుకూరి తనయడు శివ కందుకూరి హీరో గా ఒక సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమా కోసం ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అని తెలుస్తుంది. ఈ స్క్రిప్ట్ వర్క్ అయ్యేసారికి కొంచం సమయం పట్టవచ్చు 2018 జనవరిలో సినిమా షూటింగ్ మొదలుపెడతారు అని చెబుతున్నారు. శివ కందుకూరి అమెరికాలో పెన్న్ స్టేట్ యునివర్సిటిలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. 2018 నాటికి డిగ్రీ పూర్తి అవుతుందట. డిగ్రీ పూర్తి కాగానే శివానితో శివ సినిమా మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి.

శివ కందుకూరి ఇంకా హీరో కావలిసి ఉంది ఏమో కానీ శివాని అప్పుడే హీరోయిన్ అయ్యినట్లే అనిపిస్తుంది ఆమె ఫోటో షూట్లు చూస్తుంటే. ఇకపోతే క్వాన్ ఏజెన్సీ రాజశేఖర్ కూతురు శివానికి సరైన ఆఫర్ అందినట్లే చేసారు. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే శివాని తన కెరియర్ కోసం ఫ్యామిలి ని వాడుకునేటట్లు కనిపించటం లేదు.