Begin typing your search above and press return to search.

రాజశేఖర్ కూతురు ఒప్పందం చేసుకుంది

By:  Tupaki Desk   |   19 July 2017 5:36 AM GMT
రాజశేఖర్ కూతురు ఒప్పందం చేసుకుంది
X
అగ్ర హీరోల కొడుకులు హీరో అవ్వడం మన పరిశ్రమలో సర్వసాధారణ విషయం కానీ ఒక స్టార్ కపుల్ కూతురు హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం కొంచం కొత్త మన పరిశ్రమకు. కూతురులుకు నటించాలని ఉన్నా ఒప్పుకొని హీరో తండ్రులు ఉన్నారు మన ఇండస్ట్రిలో. అలాంటిది ఇప్పుడు ఒక స్టార్ హీరో కూతురు హీరోయిన్ గా అవకాశాలు కోసం ఎదురుచూస్తుంది. దాని కోసం సర్వం సిద్దం చేసుకుంటుంది అంతా ఆ కూతురు తనకు తనే.

సీనియర్ తెలుగు హీరోలలో ఒకడైన డాక్టర్ రాజశేఖర్ ఇప్పుడు సినిమాలు కొంచెం తగ్గించిన మాట నిజమే కానీ ఆ తగ్గటం వెనక కారణం తనకు సరైన కథలు దొరికాకే అంటున్నాడు. ఇప్పుడు ఈ హీరో సినిమా గురించి కన్న అతని కూతురు శివాని సినిమా కోసం ఇండస్ట్రి ఎదురుచూస్తుంది. శివానికి స్వతహాగా నటి కావాలని ఎప్పటి నుండో ఉంది అని చెబుతుంది. దానికోసం శివాని ఒక సెలిబ్రిటీ మేనేజ్మెంట్ ఏజెన్సీను కూడా సంప్రదించింది. ‘క్వాన్’ అనే ఒక పేరు ఉన్న టాలెంట్ ఏజెన్సీ లో శివాని ఒక ఒప్పందం కుదుర్చుకుందట. బాలీవుడ్ - కోలివుడ్ ఇండస్ట్రికి అవసరమైన టాలెంట్ ని వెతకటంలో ఈ ఏజెన్సీ మంచి పేరు ఉంది. శివాని ఈ మద్యనే ఒక మీడియా హౌస్ వాళ్ళతో ఫోటో షూట్ కూడా చేసింది. డాక్టర్ డిగ్రీ పూర్తి చేసిన ఈ తెలుగు హీరో కూతురు తెలుగు తమిళ్ భాషలు అనర్గళంగా మాట్లాడగలదు.

నేను మా అమ్మ(జీవిత)లానే రెగ్యులర్ హీరోయిన్ గా నటన గ్లామర్ రెండింటినీ చేయడానికి ఆలోచిస్తున్నాను. అమ్మ జీవిత కానీ నాన్న కానీ నా నిర్ణయాలలో ఎప్పుడూ తలదూర్చరు. నా కెరియర్ ని నేను ఎంచుకోవడంలో నాకు వాళ్ళు పూర్తి స్వేచ్చ ఇచ్చారు అని చెప్పింది. తమిళ్ తెలుగు భాషలు తెలిసిన శివాని ముందుగా తమిళ్ సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెబుతున్నారు. ​