Begin typing your search above and press return to search.

బాలీవుడ్ దారిలో రాజశేఖర్ తనయ

By:  Tupaki Desk   |   2 April 2019 9:53 AM GMT
బాలీవుడ్ దారిలో రాజశేఖర్ తనయ
X
సౌత్ లో హీరోల వారసులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా అభిమానులు రెడ్ కార్పెట్ వేస్తారు కాని అదే వెల్కం వాళ్ళ కూతుళ్ళకు ఉండదన్నది వాస్తవం. కారణం తాము ప్రాణంగా ఇష్టపడే హీరోల వారసురాళ్ళు గ్లామర్ విషయంలో రాజీ పడాల్సి వస్తే అది కుటుంబానికే చెడ్డ పేరు తీసుకొస్తుందనేది వాళ్ళ ఫీలింగ్. ఈ కారణంగానే కృష్ణ గారి అమ్మాయి మంజుల నటన మీద ఎంత ఆసక్తి ఉన్నా కేవలం సింగల్ డిజిట్ సినిమాలతో సర్దుకుని తర్వాత నిర్మాణం కుటుంబం వైపు దృష్టి సారించారు.

నీహారిక సైతం మెగా ఫ్యాన్స్ ఆలోచనలకు అనుగుణంగా ఉండాల్సిందే. ఈ గొడవలు ఎందుకని రజనికాంత్ బాలకృష్ణ లాంటి వాళ్ళు తమ ఆడ బిడ్డలను అసలు తెరమీద చూపించేందుకు ఆసక్తి చూపించలేదు. ఒక్క కమల్ హాసన్ మాత్రమే ఈ ట్రెండ్ కు ఎదురీది శృతి అక్షరలకు పూర్తి స్వేచ్చ ఇచ్చి కెరీర్లను చూపించాడు

ఇప్పుడు యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతుళ్ళ వంతు వచ్చింది. ఆయన రెండో తనయ శివాత్మికను హీరొయిన్ గా పరిచయం చేస్తూ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను లాంచ్ చేస్తూ దొరసాని అనే మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. మొన్నే టైటిల్ లోగోతో ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇందులో శివాత్మికకు ఆనంద్ కు ఓ లిప్ లాక్ సీన్ ఉందట. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో దొర కూతురికి ఓ పాలేరు కొడుక్కి మధ్య లవ్ స్టొరీగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలిసింది. సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసిన దొరసానిలో ఈ న్యూస్ కనక నిజమైతే లిప్ లాక్ కిస్ ఇచ్చిన ఫస్ట్ టాలీవుడ్ స్టార్ డాటర్ తనే అవుతుందేమో.