Begin typing your search above and press return to search.

90 సినిమాల్లో చూడని రాజశేఖర్ ని 'శేఖర్'లో చూస్తారట!

By:  Tupaki Desk   |   11 Jan 2022 11:30 PM GMT
90 సినిమాల్లో చూడని రాజశేఖర్ ని శేఖర్లో చూస్తారట!
X
రాజశేఖర్ కథానాయకుడిగా జీవిత 'శేఖర్' సినిమాను రూపొందిస్తున్నారు. మలయాళంలో 2018లో వచ్చిన 'జోసెఫ్' సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో జోజు జార్జ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, పద్మకుమార్ దర్శకత్వం వహించాడు. రిటైర్మెంట్ తీసుకున్న తరువాత ఒక నలుగురు పోలీస్ ఆఫీసర్స్ జీవితంలో జరిగిన ఒక సంఘటన చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న జీవిత, రాజశేఖర్ లు ఈ సినిమాను గురించి ప్రస్తావించారు.

జీవిత మాట్లాడుతూ .. "ఈ సినిమాలో రాజశేఖర్ లుక్ కోసం ముందుగా ఫొటో షూట్ చేశాము. డెఫినెట్ గా ఇంతవరకూ ఇది రాజశేఖర్ గారు చేయని పాత్ర. ఈ సినిమాలో ఆయన ఏజ్ కూడా యాభై ఏళ్ల పైబడే ఉంటుంది. 80 శాతం సినిమాలో అలాగే కనిపిస్తారు. 20 శాతం మాత్రం ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. రాజశేఖర్ గారికి ఇది 91వ సినిమా. గత 90 సినిమాల్లో చూడని ఒక రాజశేఖర్ గారిని ఆడియన్స్ ఈ సినిమాలో చూస్తారు. నేను ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసేది కూడా ఏమిటంటే, రాజశేఖర్ గారి గత చిత్రాలను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఊహించుకోవద్దు.

ఈ సినిమాలో ఫైట్లు .. యాక్షన్ సీక్వెన్స్ ఉండవుగానీ, వాటిని చూసినప్పుడు మనకి ఎలాంటి ఒక ఎమోషన్ వస్తుందో అలాంటి ఎమోషన్ మాత్రం కలుగుతుంది. ఏం జరుగబోతోంది? అనే ఉత్కంఠ కంటిన్యూగా ఉంటుంది. కథ కొత్తగా .. చాలా ఇంట్రెస్టింగా ప్రేక్షకులను ముందుకు తీసుకుని వెళుతూ ఉంటుంది. ఆయన కూడా బాగా చేశారు. ఒక డైరెక్టర్ గా నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఈ సినిమాలో మొదటి నుంచి చివరి వరకూ ఒక ఎమోషన్ కొనసాగుతూ ఉంటుంది. ఆ ఎమోషన్ కి ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ అవుతారు.

ఈ సినిమా ఫస్టు ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ వరకూ ఆసక్తికరంగా అనిపిస్తుంది. నేను దర్శకత్వం చేసేటప్పుడు కూడా అంతగా గమనించలేదుగానీ, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నప్పుడు చూస్తే, ఏ ఫ్రేమ్ లో కూడా ఫీల్ తగ్గలేదు అనిపించింది. అప్పుడు మాత్రం ఒక ఆర్టిస్టుగా గా కూడా నాకు చాలా బాగా అనిపించింది. 'శేఖర్' పాత్ర బిగినింగ్ నుంచి ఒక ఎమోషన్ తో కనిపిస్తుంది. సినిమా అయిపోయి థియేటర్లో నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా ఆ పాత్ర మనలను వెంటాడుతున్నట్టుగా అనిపిస్తుంది. రాజశేఖర్ గారి బర్త్ డే ఫిబ్రవరి 4. అన్నీ కలిసొస్తే ఆ రోజున రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాము" అని చెప్పుకొచ్చారు.