Begin typing your search above and press return to search.

గ‌జ‌రాజు ఆశీస్సులతో రాజమౌళి టార్గెట్‌

By:  Tupaki Desk   |   21 Oct 2015 5:36 AM GMT
గ‌జ‌రాజు ఆశీస్సులతో రాజమౌళి టార్గెట్‌
X
600కోట్ల క్ల‌బ్ ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. దేశంలోనే టాప్ 3 సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది బాహుబ‌లి. పీకే - భ‌జ‌రంగి భాయిజాన్ త‌ర్వాత రికార్డు ఈ సినిమాదే. మునుముందు చైనా మార్కెట్‌ - జ‌పాన్ మార్కెట్ అంటూ స్థానం పెంచుకునే ప‌నిలో ఉన్నాడు. అయితే ఇంత‌లోనే బాహుబ‌లి పార్ట్ 2ని తెర‌కెక్కించేందుకు ఆయుధాల్ని సిద్ధం చేస్తున్నాడు.

ఈ సారి తెలుగు - త‌మిళ్‌ - హిందీ తారాగ‌ణాన్ని మిక్సింగ్ చేసి, 1000 కోట్లు పైగా వ‌సూలే చేసే భారీ సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ఆరంభ‌మే కార్పొరెట్ దిగ్గ‌జాల‌తో మాట్లాడుకుని భారీ ప‌థ‌కానికి తెర తీశాడు. ముందే కార్పొరెట్‌ కి అమ్మేయ‌డం ద్వారా వ‌చ్చే డ‌బ్బుతో అసాధార‌ణ రీతిలో విజువల్ గ్రాఫిక్స్‌ ని ప్లాన్ చేసి స‌రికొత్త సినిమాని ప్ర‌పంచ దేశాల‌కు చూపించాల‌ని తాప‌త్రాయ ప‌డుతున్నాడు.

అయితే ఇంత‌లోనే ఓ మారు పాత స్మృతుల‌ను గుర్తు చేసుకోవాల‌నుకున్నాడేమో.. బాహుబ‌లి సెట్స్‌ లో ఓ గ‌జ‌రాజు త‌న‌ని ఎంతో ప్రేమ పూర్వ‌కంగా ద‌గ్గ‌ర‌కు చేర‌నిచ్చి తొండంతో ఆశీర్వ‌దిస్తున్న ఛాయాచిత్రాన్ని ఫేస్‌ బుక్‌ లో పెట్టి అభిమానుల‌కు చూపించాడు. గ‌జ‌రాజు ఆశీస్సులు ఉన్నాయి. ఇక నా ల‌క్ష్యం 1000 కోట్లు. బాహుబ‌లి : ది క‌న్‌ క్లూజ‌న్‌ తో అది సాధ్య‌మే. అన్న కాన్ఫిడెన్స్ అత‌డిలో క‌నిపిస్తోందిప్ప‌డు. జ‌య‌హో జ‌క్క‌న్న‌! ఆల్ ది బెస్ట్‌.