Begin typing your search above and press return to search.
ఆయన లైన్ లో బన్ని, అజిత్, మహేష్
By: Tupaki Desk | 11 Aug 2015 12:53 PM ISTజక్కన్న రేంజు ఒక్కసారిగా మారిపోయింది. అతడి జీవితాన్ని బాహుబలి ముందు, బాహుబలి తర్వాత అని డిక్లేర్ చేయాల్సిందే. 600కోట్ల క్లబ్ లో చేరడానికి బాహుబలి పరుగులెడుతోంది. ఇప్పటికీ థియేటర్లన్నీ హౌస్ ఫుల్స్. అంటే ఈ సినిమా ఇంకా లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డుల్ని క్రియేట్ చేస్తుందో ఇప్పుడే అంచనా వేయలేం. అందుకే ఇప్పుడు అతడి వెంట పడే హీరోల సంఖ్య కూడా పెరిగింది.
ఇప్పటికే మహేష్ తో సినిమా ఉంటుందని ఊహాగానాలు మొదలయ్యాయి. మహేష్ సైతం ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడు. ఈలోగానే జక్నన్న తండ్రి, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ మరో కొత్త ప్రాజెక్టు డీటెయిల్స్ చెప్పారు. బన్ని, అజిత్ కలయికలో రాజమౌళి దర్శకుడిగా ఓ సినిమా తెరకెక్కుతుందని ప్రకటించారు. ఒక బలమైన సందేశం ఉన్న కమర్షియల్ సినిమా ఇదని చెప్పారాయన.
అయితే ఈ ప్రకటనతో అభిమానుల్లో కన్ఫ్యూజన్ తలెత్తింది. బాహుబలి -2 తర్వాత మొదటి ప్రాజెక్ట్ ఎవరితో ఉంటుంది? మహేష్‌తోనా? లేక బన్ని-అజిత్ తోనా? అన్నది తేలాల్సి ఉందింకా. ముందుగా జక్కన్న ఎవరికి అవకాశం ఇస్తారన్నదానికి కాలమే సమాధానం చెప్పాలి. వెయిట్ అండ్ సీ.