Begin typing your search above and press return to search.
ఆయన ట్రాక్ రికార్డే ప్లస్సయ్యింది
By: Tupaki Desk | 27 Oct 2015 7:00 AM ISTబాహుబలి లాంటి పాత్రతో భార విజయాన్ని దక్కించుకున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని స్టార్ అయిపోయాడు. అయితే తానింకా జాతీయ స్థాయి హీరోని కాదు అని చెప్పడం ప్రభాస్ కే చెల్లింది. ఇంతకీ ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి పెళ్లిపై కొన్ని నిశ్చితాభిప్రాయాలన్నాయి. అవేంటో తెలియాంటే.. ప్రభాస్ తో ఇంటర్వ్యూ చదవండి..
ప్రశ్న- బాహుబలి ప్రభాస్ కి ఎలా ప్రత్యేకమైనది ?
జవాబు - బ్లాక్ బస్టర్ అయిందని కాకపోయినా.. బాహుబలి చాలా ప్రత్యేకమైన సినిమా. ఎవరైనా, ఏ స్టార్ అయినా సినిమాకంటే ఎక్కవ కాదని నిరూపించిందీ మూవీ.
ప్రశ్న- బాహుబలి విజయం క్రెడిట్ మీది కాదంటారా ?
జవాబు - ఈ చిత్రాన్ని నా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. అందరి హీరోల, స్టార్ల ఫ్యాన్స్ చూశారు. అందుకే ఇంత విజయం సాధించింది. సినిమాలో హైలైట్ గా నిలవడానికి, క్రెడిట్ మొత్తం దక్కించుకోడానికి చాలా తేడా ఉంది. ఈ సినిమాకి పని చేసిన అతి చిన్న వ్యక్తి వరకూ ఈ సక్సెస్ క్రెడిట్ దక్కుతుంది.
ప్రశ్న- విజయం సాధించిన ఘనత మాదే అనే స్టార్ల రూట్ ని మీరు మార్చుతారా ?
జవాబు - ఇతరుల గురించి నేను మాట్లాడను, వారిని జడ్జ్ చేయను. కానీ ఇప్పుడీ విధానం మారుతోంది. ఇతర టెక్నీషియన్ల ప్రతిభ ఆధారంగా కూడా జనాలు సినిమాలకు వస్తున్నారుగా..
ప్రశ్న- స్టార్ హీరోల చిత్రాలపై డిస్ట్రిబ్యూటర్లు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారుగా ?
జవాబు - ఒక్కో హీరోకి ఒక్కో రకంగా మార్కెట్ ఉంటుంది. సినిమాకి సినిమాకి కూడా మారుతూ ఉంటుంది. ట్రాక్ రికార్డ్ ఆధారంగానే ఇదంతా ఉంటుంది. బాహుబలి విషయంలో అపజయం ఎరుగన రాజమౌళి ట్రాక్ రికార్డ్ ఎక్కువ ప్లస్ అయింది.
ప్రశ్న- ఈ స్థాయి విజయం ఊహించారా ?
జవాబు - పెద్ద బడ్జెట్ సినిమా కావడంతో బ్లాక్ బస్టర్ కావాలని ప్రారంభం నుంచీ అనుకున్నాం. అయితే ఈ స్థాయిలో విజయం దక్కుతుందని ఎవరం ఊహించలేదు.
ప్రశ్న- బాహుబలి విజయం నేర్పిన పాఠం ఏంటి?
జవాబు - ఇతర భాషల్లోనూ అందరికీ అవకాశం ఉంటుందని తెలుసకున్నాను. మొదట తెలుగు, తమిళంలోనే చేద్దామని అనుకున్నాం. హిందీ, మళయాళంలో కూడా డబ్ చేసే ఆలోచన రాజమౌళిదే. భారతీయ సినిమా సత్తా ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి. ఇప్పుడు చరిత్ర ఆధారంగానో, యుద్ధాలపైనో సినిమా తీయాలంటే విదేశాలపై ఆధారపడనవసరం లేదని నిరూపిచారు రాజమౌళి
ప్రశ్న- జాతీయ స్థాయి హీరోగా గుర్తింపు రావడంపై ఏమంటారు ?
జవాబు - నాకు పేరు తెచ్చిపెట్టినందుకు చాలా సంతోషం. నేను ఎక్కడికెళ్లినా ప్రజలు గుర్తు పడుతున్నారు. ఇప్పుడే నేషనల్ హీరోని అయిపోయాను అనుకోవడం లేదు. చాలా ప్రాజక్టుల్లో ఆఫర్స్ వచ్చాయి. ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు.
ప్రశ్న- పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉన్నారెందుకు?
జవాబు - మ్యారేజ్ చాలా పెద్ద బాధ్యత. ఈ విషయంలో తొందరపడ కూడదన్నది నా ఉద్దేశ్యం. నాకు తగిన అమ్మాయి నాకింకా దొరలేదు. ఇప్పుడు నేను చేయాల్సింది చాలాఉండగానే.. ఓ అనుబంధం కోస పరుగు పెట్టడం ఇష్టం లేదు. ఇది సరైన టైం అనుకున్నపుడు.. నేనే అమ్మాయిని వెతుక్కుంటా.