Begin typing your search above and press return to search.

ఎవ్వరినీ వదలని రాజమౌళి

By:  Tupaki Desk   |   15 July 2015 11:34 PM IST
ఎవ్వరినీ వదలని రాజమౌళి
X
బహుశా తెలుగు సినిమా చరిత్ర మొత్తంలో అపజయమే లేకుండా పది సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు రాజమౌళేనేమో. మహామహులైన ఎంతోమంది దర్శకులకు ఎక్కడో ఓ చోట ఎదురుదెబ్బ తగిలింది. కానీ రాజమౌళి మాత్రం తన సక్సెస్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నాడు. కానీ అంత ఎత్తుకు ఎదిగినా.. అతడిలో కించిత్ గర్వమైనా ఉండదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం రాజమౌళిని చూసే నేర్చుకోవాలి. తానెంత గొప్ప సినిమా తీసినా.. ‘బాహుబలి’ ప్రమోషన్స్‌లో ఎక్కడా అతను కొంచెమైనా గర్వం చూపించలేదు. బాహుబలి విడుదల తర్వాత దేశవిదేశాల్లో ఎందరో ప్రముఖులు తనను ప్రశంసల్లో ముంచెత్తాక.. అంతర్జాతీయ మీడియా సైతం తనను ఆకాశానికెత్తేశాక కూడా అతడిలో ఏమాత్రం గర్వం కనిపించలేదు.

బాహుబలి విడుదలైన ఐదో రోజు ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చిన రాజమౌళి.. తన సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. ఆ తర్వాత తన సినిమా గురించి ట్వీట్లు చేసిన సెలబ్రెటీలకు ఒక్కొక్కరి టైమ్ లైన్‌కు వెళ్లి పర్సనల్‌గా థ్యాంక్స్ చెప్పబోతున్నట్లు ప్రకటించాడు. అన్నట్లే ట్విట్టర్లో ‘బాహుబలి’ గురించి ట్వీట్ చేసిన ప్రతి సెలబ్రెటీ టైమ్‌లైన్‌కు వెళ్లి వాళ్ల ట్వీట్‌కు థ్యాంక్స్ చెబుతూ రిప్లై

ఇచ్చాడు. మహీంద్రా గ్రూపు అధినేత ఆనంద్ మహేంద్ర, తమిళ డైరెక్టర్ శంకర్, హీరో ధనుష్‌.. వీళ్లకు మాత్రమే కాదు.. మనదగ్గర వెన్నెల కిషోర్, సుబ్బరాజు లాంటి వాళ్లకు కూడా రిప్లై ఇచ్చాడు జక్కన్న. మొత్తానికి బాహుబలి గురించి ప్రశంసలు కురిపించిన ఎవ్వరినీ వదలకుండా.. ఓపిగ్గా కొన్ని గంటల సమయం వెచ్చించి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు రాజమౌళి. జక్కన్న వినమ్రత చూసి ఈ సెలెబ్రెటీలతో పాటు అభిమానులు కూడా ఫ్లాట్.