Begin typing your search above and press return to search.

ఆ 30 లక్షల మందికి జక్కన్న సలాం

By:  Tupaki Desk   |   9 April 2017 4:50 PM IST
ఆ 30 లక్షల మందికి జక్కన్న సలాం
X
తన సినిమాలతో ఎన్నెన్నో రికార్డుల్ని తిరగరాసిన దర్శక ధీరుడు రాజమౌళి.. ఇటీవలే సోషల్ మీడియాలోనూ సౌత్ ఇండియన్ డైరెక్టర్లలో ఎవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్న సంగతి తెలిసిందే. దక్షణాదిన ట్విట్టర్లో 3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్న తొలి దర్శకుడిగా రాజమౌళి రికార్డు సృష్టించాడు. ఈ ఘనతపై రాజమౌళి కొంచెం లేటుగా స్పందించాడు. ఈ రోజు ‘బాహుబలి: ది కంక్లూజన్’ తమిళ ఆడియో వేడుకకు చెన్నై బయల్దేరబోతూ.. ఆ విషయాన్ని ట్విట్టర్లో ప్రస్తావించిన జక్నన్న పనిలో పనిగా తన 30 లక్షల ఫాలోవర్లకు ధన్యవాదాలు చెప్పాడు.

‘‘30 లక్షల హృదయాలు.. మీరంతా నన్ను ప్రేమించారు. ప్రశంసించారు. మద్దతుగా నిలిచారు. అలాగే నన్ను విమర్శించారు. నాకు సాయం చేశారు. నన్ను మేల్కొలిపారు. నన్ను మీ కుటుంబ సభ్యుడిలాగా ఆదరించారు. అందరికీ ధన్యవాదాలు’’ అని రాజమౌళి ట్వీట్ చేశాడు. తనను ప్రేమించిన వాళ్లతో పాటు ధ్వేషించిన వాళ్లకు కూడా ధన్యవాదాలు తెలిపిన రాజమౌళి.. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండాలని తాను కూడా తన లాగే ఉంటానని వ్యాఖ్యానించడం విశేషం. ప్రస్తుతం ట్విట్టర్లో రాజమౌళికి చేరువగా ఉన్న సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే. ఆయన ఫాలోవర్ల సంఖ్య 2.8 మిలియన్లకు పైగా ఉంది. ఆ తర్వాత మురుగదాస్ (2.2 మిలియన్లు) మినహా మరే సౌత్ ఇండియన్ డైరెక్టర్ 2 మిలియన్ క్లబ్బులోకి కూడా చేరలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/