Begin typing your search above and press return to search.
రాజమౌళీ.. ఆస్కార్ కోసమేనా ఈ పాట్లన్నీ!!
By: Tupaki Desk | 11 July 2015 5:14 PM ISTతెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సినిమా ప్రేమికులు ఎదురు చూసిన బాహుబలి సినిమా విడుదలైంది. సినిమా.. నిర్మాణం.. టేకింగ్.. విజువల్స్ అద్భుతంగా ఉన్నా.. హాల్లో కూర్చున్నంతసేపూ ప్రేక్షకుడు తనను తాను మర్చిపోయినా.. హాల్లోంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం నిరాశగానే వచ్చాడు. ఇందుకు కారణం.. దీనికి క్లైమాక్స్ లేకపోవడం.. ఇది రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాలో ఇంటర్వెల్ కావడమే. ఇంకో విశేషం ఏమిటంటే ఇంటర్వెల్ తర్వాత పార్టు చూడాలంటే ఏడాదికాలం ఆగాల్సి రావడం. ఇంతకీ రెండు పార్లును ఒకేసారి లేదా కొంచెం విరామంలో ఎందుకు విడుదల చేయలేదు. ఏడాది గ్యాప్ ఎందుకు తీసుకుంటున్నాడు అనే సందేహాలు వస్తున్నాయి. ఇందుకు రకరకాల వాదనలూ ప్రారంభం అయ్యాయి.
ఈగ సినిమా నిర్మించినప్పుడే రాజమౌళి దీనికి ఆస్కార్ వస్తుందని ఊహించాడు. రాజమౌళి అన్న మాటేమిటి.. సినిమా ప్రేక్షకుల్లో ఎంతోమంది ఈగకు ఆస్కార్ రావాలని కోరుకున్నారు. కానీ ఈగ కనీసం ఆస్కార్‌కే వెళ్లలేదు. ఆ ఏడాది ఇండియా నుంచి వెళ్లే ఎంట్రీల్లో మరొక సినిమాకు ఆ అవకాశం దక్కడంతో ఈగ వెనక్కి వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ ఏడాది ఆ అవకాశం బాహుబలికి వస్తుందా లేదా అనేది కూడా అనుమానమే. చివరి నిమిషంలో మరొక సినిమా ఏదీ రాకపోతే.. ఉత్తరాది ఒత్తిళ్లు పని చేయకపోతే బాహుబలి సినిమాకు తప్పనిసరిగా ఆస్కార్ ఎంట్రీ రావాల్సిందే. ఈసారి ఆస్కార్ ఎంట్రీ వస్తే బాహుబలికి తప్పకుండా ప్రాంతీయ చిత్రాల్లో ఆస్కార్ అవార్డు వస్తుంది. ఒకవేళ ఇక్కడినుంచి వెళ్లే ఎంట్రీల్లోనే ఏదైనా ఇబ్బంది వస్తే వచ్చే ఏడాది అయినా దీనిని ఆస్కార్‌కు పంపాలనేది రాజమౌళి ఆలోచనగా చెబుతున్నారు. అందుకే దీనిని రెండు పార్టులు చేసి, రెండు పార్టులను రెండేళ్లలో విడుదల చేస్తున్నారు. ఈ రెండేళ్లలో ఏ ఒక్క పార్టు ఆస్కార్‌కు వెళ్లే అవకాశం దక్కించుకున్నా అవార్డు గ్యారెంటీ అని భావిస్తున్నారు.
బాహుబలికి ఆస్కార్ రావాలని.. ఆ ఘనత మన తెలుగు వాడికి రావాలని.. రాజమౌళి దానిని అందుకోవాలని ఆశిద్దాం!