Begin typing your search above and press return to search.

శ్రీవల్లిని ఏమాత్రం కాపాడతాడో

By:  Tupaki Desk   |   6 Sept 2017 6:00 AM IST
శ్రీవల్లిని ఏమాత్రం కాపాడతాడో
X
బాహుబలి బాక్స్ ఆఫీస్ దెబ్బకి రాజమౌళి పేరు ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కలానికి చూపులా ఆయన తెరక్కించిన దృశ్య కావ్యాలు ఎన్నో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టాయి. ఇతరులతో తండ్రి అందించిన కొన్ని కథలు దారి తప్పినా రాజమౌళి మాత్రం ఎప్పుడు కూడా ఒక్క కథని దారి తప్పించలేదు. తీసిన ప్రతి సినిమా ఎదో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ.. ఇతర ఇండస్ట్రీల ప్రముఖుల ప్రశంసలను అందుకునేవి. అందుకు బాహుబలి వంటి సినిమానే సాక్ష్యం.

అయితే రచయితగా మంచి పేరు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ దర్శకుడి గాని పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. కాకపోతే ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోలేవు. చివరగా రాజన్న సినిమా మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను చాలా ఆకట్టుకొంది. అయితే ఆ తర్వాత ఆయన ఏ సినిమాలను తెరకెక్కించే ప్రయత్నం చేయలేదు కానీ గత సంవత్సరం మాత్రం శ్రీవల్లి అనే సినిమాను స్టార్ట్ చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రిలీజ్ చేద్దామనుకున్నారు. సినిమా మొత్తాన్ని పూర్తి చేశారు. కానీ ఎందువల్లనో సినిమా మాత్రం విడుదల కాలేదు. ఫైనల్ గా ఈ సినిమాను ఈ నెల 17న రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు నిర్మాత రాజ్ కుమార్ బృందావనం. ఇక ప్రమోషన్స్ బాధ్యతని పూర్తిగా రాజమౌళి తీసుకున్నాడట.

అయితే సోషల్ మీడియాలో ఈ మధ్య రాజమౌళి సపోర్ట్ చేసిన ఏ సినిమాలు అంతగా ఆడలేదు. పటేల్ సర్ -పైసా వసూల్ వంటి సినిమాలకు జక్కన్న తెగ ప్రశంసలను అందించాడు. కానీ అవి నిరాశపరిచాయి. ఇక ఇప్పుడు శ్రీవల్లి వంటి సైంటిఫిక్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాకి జక్కన ఏకంగా వాయిస్ ఓవర్ ఇచ్చేశాడు. అంతే కాకుండా సినిమా విడుదలయ్యే వరకు సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో కూడా రాజమౌళి బిజీ అవ్వనున్నాడట. ఈయన సపోర్టుతో డాడ్ తీసిన ఎరోటిక్ థ్రిల్లర్ గట్టెక్కుతుందా?