Begin typing your search above and press return to search.

బాహుబలి 2.. అంత భారీగా తీస్తున్నారా?

By:  Tupaki Desk   |   13 July 2016 11:00 PM IST
బాహుబలి 2.. అంత భారీగా తీస్తున్నారా?
X
బాహుబలి ది బిగినింగ్ మూవీ టాలీవుడ్ లోనే కాదు.. ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసింది. విడుదలైన ప్రతీ భాషలో సంచలనాలు సృష్టించింది. ఇంతగా ఆ మూవీ సెన్సేషన్స్ కి కారణం.. అందులో ఉన్న భారీతనమే. మిగతా సినిమా మొత్తం కంటే.. ఆ మూవీ క్లైమాక్స్ తీసిన విధానమే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

బాహుబలి ది బిగినింగ్ క్లైమాక్స్ చిత్రీకరణ కోసం 1000 మంది ఆర్టిస్టులను ఉపయోగించారు. అయినా సరే గ్రాఫిక్స్ లో లక్షల కొద్దీ సైన్యాన్ని సృష్టించారు. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కోసం.. ఏకంగా వంద రోజుల షూటింగ్ ప్లాన్ చేయడమే కాకుండా.. 5వేల మంది ఆర్టిస్టులను ఉపయోగిస్తుండడం విశేషం. పైగా కేవలం క్లైమాక్స్ చిత్రీకరణే 30 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు దర్శక నిర్మాతలు. ఇంత భారీగా తీయడాన్ని నిజానికి సాహసమే అనాలి కానీ.. తాను ఎంత బడ్జెట్ తో తీసిన చిత్రానికి అయినా న్యాయం చేయగలనని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు జక్కన్న.

ఒక క్లైమాక్స్ కే 30 కోట్ల చొప్పున.. మొత్తం సినిమాకి 200 కోట్లకు పైగానే బడ్జెట్ కేటాయించి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి కానుండగా.. 2017 ఏప్రిల్ లో బాహుబలి ది కంక్లూజన్ విడుదల చేయనున్నాడు రాజమౌళి.