Begin typing your search above and press return to search.

చైతూ నాగార్జునని మరిపిస్తున్నాడు: రాజమౌళి

By:  Tupaki Desk   |   11 April 2015 11:52 AM IST
చైతూ నాగార్జునని మరిపిస్తున్నాడు: రాజమౌళి
X
నాగచైతన్య హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన 'దోచెయ్‌' ఆడియో వేడుక నిన్న సాయంత్రం ఓ ఐదునక్షత్రాల హోటల్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఓ ఇద్దరిని బాగా పొగిడేశారు. ఆయన అన్న మాటలు యథాతథంగా చదివితే.. సినిమా బాగా రావాలన్నా, అనుకున్నట్టు తెరకెక్కాలన్నా దర్శకుడికి పూర్తి స్పష్టత అవసరం. ఆ స్పష్టత సుధీర్‌వర్మకి ఉందని అర్థమవుతోంది. అతడు స్వామిరారా చిత్రాన్ని బాగా తీశాడు. దోచెయ్‌ ప్రచార చిత్రం ట్రెండీగా ఉంది' అని అన్నాడు. అంతేకాదు.. సినిమాల ఎంపికలో నాగార్జునని మరిపిస్తున్నాడని చైతన్యని పొగిడేశాడు రాజమౌళి. అంతేకాదు ఇదే వేడుకలో నాగార్జున, సుకుమార్‌ లాంటి ప్రముఖులు చైతన్య, సుధీర్‌ వర్మతో పాటు సినిమా కథానాయిక కృతిసనోన్‌ని తెగ పొగిడేశారు. కృతి చాలా క్యూట్‌. అంతకుమించి గొప్ప నటి అని అందరూ మెచ్చుకున్నారు. చైతూని మించి కృతిని హైలైట్‌ చేశారు. వేడుక ఆద్యంతం పొగడ్తల పండుగలా సాగింది. ఏదేమైనా ఇదంతా ప్రతిభకు బూస్ట్‌ ఇవ్వడానికే అని అంతిమంగా ప్రేక్షకుడు అర్థం చేసుకోవాలి. చైతూ ట్రెండీగా ఆల్‌ ది బెస్ట్‌ నాయనా!