Begin typing your search above and press return to search.
'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ లుక్ ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటుందా..?
By: Tupaki Desk | 26 April 2020 6:00 AM ISTటాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్-రామ్‌చరణ్ కథానాయకులుగా ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పీరియడ్ డ్రామాగా, బ్రిటిష్ కాలంలో జరిగిన కథతో దీన్ని రూపొందిస్తున్నారట. అయితే, ఎన్టీఆర్ పాత్ర రెండు వైవిధ్యమైన షేడ్స్‌ను కలిగి ఉంటుందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఒక లుక్‌లో ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేయగా, మూడో షెడ్యూల్ కోసం ఇంకాస్త బాడీ పెంచే పనిలో ఉన్నాడట తారక్. పాత్రల విషయంలో అస్సలు రాజీపడని రాజమౌళి.
ఎన్టీఆర్‌ను సరికొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిపేసి ఇళ్లకే పరిమితమయ్యారు రాజమౌళి టీమ్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో ప్రతినాయకుడి ఛాయలు కనిపిస్తాయని, తను అడవి దొంగగా కనిపించబోతున్నాడని ఇటీవల ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్ సాధారణంగా, ఇంకొన్ని సన్నివేశాల్లో కండలు తిరిగిన దేహంతో ఉంటారట. అందుకోసం తారక్ తన బాడీని మేకోవర్ చేసే పనిలో ఉన్నారట. ‘అరవింద సమేత’లో సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనమిచ్చిన ఎన్టీఆర్.
మరి ఇప్పుడు ఎలా కనిపిస్తారనేది కాస్త సస్పెన్స్. ‘బాహుబలి’ సినిమా సమయంలో వరుసగా ఒక్కో పాత్ర లుక్‌ను విడుదల చేసుకుంటూ వచ్చిన జక్కన్న ఈ సినిమా విషయంలో ఆ ఆలోచన చేయడం లేదట. మరోవైపు బాలీవుడ్ ప్రేక్షకులకు ఎన్టీఆర్‌ను పరిచయం చేసేందుకు ఒక ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం రాజమౌళి మే 20న విడుదల చేయబోయే ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు.