Begin typing your search above and press return to search.

రాజమౌళి వారసుడికి రంగం సిద్ధం?

By:  Tupaki Desk   |   19 Nov 2018 4:27 AM GMT
రాజమౌళి వారసుడికి రంగం సిద్ధం?
X
మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని తన వైపుకి తిప్పుకున్న రాజమౌళి దాని తాలుకు రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు నుంచి మొదలుపెట్టబోతున్నాడు. ఇదిలా ఉండగా రాజమౌళి వారసుడు కార్తికేయ ఎప్పటినుంచో ఆయన సినిమా వ్యవహారాల్లో చురుగ్గా ఉన్నా స్వంతంగా ఇప్పటిదాకా ఏ ప్రయత్నం చేయలేదు. కాని ఇప్పుడు నిర్మాతగా తొలి అడుగులు వేయబోతున్నట్టు సమాచారం. ఆకాశవాణి పేరుతో రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ రూపకల్పన చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందట. కార్తికేయ పెళ్లి అయ్యాక కొన్ని నెలల అనంతరం దీని షూటింగ్ స్టార్ట్ కావొచ్చని సమాచారం.

అధికారిక ప్రకటన వెంటనే రాకపోవచ్చు. ఆర్ ఆర్ ఆర్ ఓపెనింగ్ రోజు కార్తికేయ మంచి సందడిగా కనిపించాడు. దర్శకుడు అవ్వాలనే టార్గెట్ ఉన్నప్పటికీ ముందు నిర్మాతగా రుజువు చేసుకుని ఆ తర్వాత డైరెక్టర్ కార్డు గురించి అలోచిస్తాడట. మరో ట్విస్ట్ ఏంటంటే ఆర్ ఆర్ ఆర్ కు వర్క్ చేసిన టీం మొత్తం ఆకాశవాణితో ఉంటుందట. ఒక్క కెమెరామెన్ సెంథిల్ తప్ప అందరిని ఇందులో ఇన్వాల్వ్ చేసేలా ముందే ఒప్పందం కూడా జరిగిందని ఇన్ సైడ్ టాక్. ఇది ఏ జానర్ అనే విషయాన్నీ మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.

కార్తికేయకు చాలా ఇష్టమైన ఫాంటసీ బ్యాక్ డ్రాప్ కావొచ్చని సన్నిహితుల మాట. టీం తదితర వివరాలు తెలిసేందుకు టైం పట్టొచ్చు. మొత్తానికి రాజమౌళి వారసుడు త్వరలోనే గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న మాట. ఒకపక్క కీరవాణి తన పిల్లలను రంగంలో దింపేందుకు ప్లాట్ ఫార్మ్ సిద్ధం చేసి ఉంచగా ఇప్పుడు రాజమౌళి వంతు వచ్చేసింది.