Begin typing your search above and press return to search.

RRR ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రాజ‌మౌళి

By:  Tupaki Desk   |   19 Dec 2021 6:22 PM IST
RRR ఫ్యాన్స్‌కి షాకిచ్చిన రాజ‌మౌళి
X
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి RRR ఫ్యాన్స్‌కి షాకిచ్చారా? అంటే నిజ‌మ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `RRR`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబినేష‌న్‌లో దాదాపు ప్ర‌ధాన భార‌తీయ భాష‌ల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా 14 భాష‌ల్లో విడుద‌ల కానున్న చిత్ర‌మిది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్, హాలీవుడ్ సోయ‌గం ఒలివియా మోరీస్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు. అజ‌య్ దేవ‌గ‌న్‌కి జోడీ శ్రియ క‌నిపించ‌నుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన ఈ చిత్ర ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. వైర‌ల్డ్ వైడ్ గా అంచ‌నాల్ని పెంచేసిన ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ కూడా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన విష‌యం తెలిసిందే. ప్రీ ఇండిపెండెంట్ ఎరా నేప‌థ్యంలో సాగే ఫిక్ష‌న‌ల్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో క‌రుగు గ‌ట్టిన అధికారిగా రే స్టీవెన్ స‌న్‌, అలీస‌న్ డూడీ న‌టించారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ వ్యాప్తంగా వివిధ భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ మూవీ ప్ర‌మోష‌న్స్‌ని స్పీడెక్కించేశారు. హైద‌రాబాద్ , బెంగ‌ళూరు, ముంబైల‌లో ప్ర‌త్యేకంగా మీడియాతో ముచ్చ‌టించారు. అయితే పాన్ ఇండియా స్థాయి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ ప్ర‌చారాన్ని అంత‌కు మించి చేయాల‌నే భావ‌న‌కు వ‌చ్చిన చిత్ర బృందం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ ఆదివారం ముంబైలో ప్ర‌త్యేకంగా ప్లాన్ చేశారు. ఇందు కోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ ఈవెంట్ ని ప్ర‌త్య‌క్షంగా టీవీల్లో చూడాల‌ని ఆశ‌గా ఎదురుచూసి ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు రాజ‌మౌళి గ‌ట్టి షాక్ ఇచ్చారు.

ఈ ఈ వెంట్‌ని చాలా స్పెస‌ల్ గా డిజైన్ చేసిన రాజ‌మౌళి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా ప్ర‌సారం చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించి షాకిచ్చారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించిన చిత్ర బృందం మ‌రో రోజు ఈ కార్య‌క్ర‌మాన్ని టెలికాస్ట్ చేస్తామంటూ ప్ర‌క‌టించింది. అంతే కాకుండా ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ `నాటు నాటు... సాంగ్ కి పెర్ఫార్మ్ చేయ‌నున్నార‌ట‌.