Begin typing your search above and press return to search.
వర్మపై రాజమౌళి సెటైరికల్ ట్వీట్....వైరల్!
By: Tupaki Desk | 10 Feb 2020 1:50 PM ISTటాలీవుడ్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా రామ్ గోపాల్ వర్మకు పేరున్న సంగతి తెలిసిందే. సినిమా వివాదాలను పక్కనబెడితే.... కొన్ని అనివార్య కారణాలతో తన కుటుంబానికి వర్మ దూరంగా ఉంటున్నారు. అకేషనల్ గా తన కూతురు, తల్లిని వర్మ కలుస్తుంటారు. మనసులో అనుకన్నది అనుకున్నట్లు కుండబద్దలు కొట్టే రామూ మొండితనానికి చెక్ పెట్టే కుటుంబ సభ్యులెవరూ లేరన్న వెలితి ఉండేది. తాజాగా ఆ వెలితిని తీర్చేందుకు రామూ కోసం ఓ బుల్లి మనవరాలు వచ్చింది. వర్మ కుమార్తె రేవతి వర్మ పండంటి బిడ్డ ను ప్రసవించింది. మనవరాలు రాకతో రామూకు కళ్లెం పడినట్లేనని దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది.
టాలీవుడ్‌లోని దర్శకులలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. `శివ`తో టాలీవుడ్‌లో మూస ధోరణి సినిమాలకు చెక్ పెట్టిన దర్శకుడు ఒకరైతే....`బాహుబలి`తో తెలుగు సినిమా బలాన్ని చాటిచెప్పిన దర్శకుడు మరొకరు. ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సందర్భాన్ని బట్టీ ఈ ఇద్దరు దర్శకుల మధ్య ఫన్నీ ట్వీట్స్ నడుస్తుంటాయి. వర్మకు మనవరాలు పుట్టిన విషయాన్ని జక్కన్న ఫన్నీగా ట్వీట్ చేశారు. వర్మకు ఓ వైపు కంగ్రాట్స్ చెప్పిన జక్కన్న...మరోవైపు వర్మకు కళ్లెం వేసేందుకు మనవరాలు వచ్చేసిందంటూ సెటైర్ వేశారు. ఇకపై వర్మ ను...రామూ తాతా, రామూ నాన్నా లేదా గ్రాండ్ పా రామూ? ఏమని పిలవాలో తెలియడం లేదంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు. రాజమౌళి చేసిన ఈ ఫన్నీ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ అయింది. మరి జక్కన్న ట్వీట్ కు వర్మ ఫన్నీ రిటార్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.