Begin typing your search above and press return to search.
ఎమోషన్స్ పరంగా 'బాహుబలి' కంటే RRR చాలా స్ట్రాంగ్: రాజమౌళి
By: Tupaki Desk | 11 Dec 2021 11:29 AM ISTదర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా కోసం అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'బాహుబలి' వంటి వెండితెర అద్భుతాన్ని సృష్టించిన జక్కన్న నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల విడుదల చేసిన RRR ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. రాజమౌళి మరో విజువల్ వండర్ ని తెర మీద ఆవిష్కరించారని హింట్ ఇచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'బాహుబలి' ని మించిపోయిన 'ఆర్.ఆర్.ఆర్'.. థియేటర్లలో అదే స్థాయిలో వసూళ్ళు రాబడుతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని విషయాల్లోనూ బాహుబలి కి ట్రిపుల్ ఆర్ ను కంపేర్ చేసి చూస్తున్నారు.
ఇదే విషయాన్ని రాజమౌళి వద్ద ప్రస్తావించగా.. ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేయలేమని అన్నారు. ‘‘బాహుబలి తరహాలోనే సినిమా చేయాలని చాలా మంది ఎదురుచూస్తారని అదే విషయాన్ని మళ్లీ మళ్లీ తీయలేం. ప్రేక్షకులు ఒకే రకమైన భావోద్వేగం, అనుభవం కోసం చూస్తున్నారని అలాంటి సినిమానే చేయలేం. ఆడియన్స్ లో ఎలాంటి అంచనాలు ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి నేను నా కథ మరియు పాత్రలపై ఆధారపడి ఉంటాను''
''థియేటర్‌లో మనం చూపించే ప్రతిదాన్ని ప్రజలు చూస్తారు. కాబట్టి మేము అందించేది ఉత్తమంగా ఉండాలి. తాము అలాంటి అనుభవాన్ని కోరుకున్నారని.. సేమ్ అదే సినిమాని కాదని ప్రేక్షకులు గ్రహిస్తారు'' అని రాజమౌళి తెలిపారు. కేవలం ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటే 'బాహుబలి' కంటే 'RRR' చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని.. దీనిపై చాలా నమ్మకంగా ఉన్నానని జక్కన్న చెప్పారు.
'నేను మనసులో అనుకున్నది స్క్రీన్ మీద రావడానికి కష్టపడే యాక్టర్స్ మరియు టెక్నిషిన్స్ ఉండటం వల్లే తనకు అలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను' అని రాజమౌళి వెల్లడించారు. RRR ట్రైలర్ విడుదలైన సందర్భంగా వివిధ నగరాల్లో చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు ఈ వ్యాఖ్యలు చేశారు. మరి జక్కన్న చెప్తున్నట్లు యాక్షన్ తో పాటుగా బలమైన భావోద్వేగాలతో రూపొందిన 'ఆర్.ఆర్.ఆర్' ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల స్పూర్తితో ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ - శ్రియా - సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. 2022, జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో RRR విడుదల కానుంది.