Begin typing your search above and press return to search.

సీఎస్కే RRR పై జక్కన్న RRR టీమ్ స్పందన

By:  Tupaki Desk   |   8 Sep 2021 10:30 AM GMT
సీఎస్కే RRR పై జక్కన్న RRR టీమ్ స్పందన
X
దేశ వ్యాప్తంగా ఆర్ ఆర్‌ ఆర్ సినిమాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా అవ్వడంతో పాటు ఇద్దరు రియల్‌ హీరోల కథను ఇద్దరు స్టార్‌ హీరోలతో చూపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి. రాజమౌళి తన సినిమాలోని ప్రతి షాట్‌ విషయంలో ఎంతో జాగ్రత్తను తీసుకుంటాడు. అలాగే తన సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా అంతే శ్రద్ద చూపిస్తారు. ఈమద్య కాలంలో సినిమాలకు మంచి ప్లాట్‌ ఫామ్స్ సోషల్‌ మీడియా. ప్రచారం విషయంలో చాలా మంది సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో ఆర్ ఆర్‌ ఆర్ టీమ్‌ చాలా యాక్టివ్‌ గా ఉంటుంది అనే విషయం అందరికి తెల్సిందే. ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్‌ స్టా అన్ని చోట్ల కూడా ఆర్ ఆర్ ఆర్‌ టీమ్‌ అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు సెలబ్రెటీల ట్వీట్స్ కు సమాధానం ఇస్తూ సినిమా గురించి పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.

తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్ జట్టు అఫిషియల్‌ ట్విట్టర్ అకౌంట్ లో రుతురాజ్.. రాబిన్ ఉతప్ప.. రైనాలు కలిసి కూర్చున్న ఫొటోను షేర్‌ చేసి ముగ్గురు ఆర్ లు అంటూ ఆర్‌ ఆర్‌ ఆర్‌ హ్యాష్ ట్యాగ్‌ చేయడం జరిగింది. చెన్నై సూపర్‌ కింగ్స్ ట్వీట్‌ కు జక్కన్న టీమ్ రియాక్ట్‌ అయ్యింది. ఈ ముగ్గురు ఆర్‌ ల ఆటను చూసేందుకు మేము అంతా కూడా విజిల్స్ పట్టుకుని వెయిట్‌ చేస్తున్నాము అంటూ సమాధానం ఇచ్చారు. యూఏఈలో జరుగబోతున్న ఐపీఎల్‌ బ్యాలన్స్ మ్యాచ్‌ ల కోసం జట్లు అన్ని కూడా ఇప్పటికే అక్కడకు చేరుకున్నాయి. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న సందర్బంగా ముగ్గురు ఆర్ లు ఇలా సేద తీరిన సమయంలో తీసిన ఫొటో అది.

ఇక రాజమౌళి ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విషయానికి వస్తే షూటింగ్‌ ను ముగించిన జక్కన్న విడుదల విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు. అక్టోబర్ లో ఉంటుందని మొన్నటి వరకు అనుకున్నా కూడా థియేటర్లు లేకపోవడంతో పాటు.. కరోనా భయం ఇంకా ఉన్న నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించబోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి లేదా సమ్మర్ లో సినిమా ఉంటుందని అంటున్నారు. సంక్రాంతి వరకు కూడా పరిస్థితులు సర్దుకుంటాయా అంటే డౌటే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కనుక ఖచ్చితంగా ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా వచ్చే సమ్మర్‌ వరకు ఆగే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.