Begin typing your search above and press return to search.

#RRR కథ కూడా హలో టైపులోనే!!

By:  Tupaki Desk   |   23 April 2018 6:44 PM IST
#RRR కథ కూడా హలో టైపులోనే!!
X
రాజమౌళి-రామ్ చరణ్- రామారావు.. ఈ కాంబినేషన్ కు జక్కన్న ముద్దుగా పెట్టుకున్న పేరు #RRR. ఈ ప్రాజెక్టు గురించిన ప్రతీ అప్డేట్ వైరల్ అవుతోంది. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడం.. రామ్ చరణ్-ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో అంతటా ఆసక్తి పెరిగిపోయింది.

ఈ సినిమా కథపై చాలా రకాల వదంతులే ఉండగా.. ఇప్పుడు RRR గురించి ఓ కొత్త అప్డేట్ మరీ ఆసక్తికరంగా ఉంది. స్పోర్ట్స్ థీమ్ తో రూపొందుతున్న సినిమా అవునా కాదా అనే సంగతి ఇంకా తేలలేదు కానీ.. ఈ చిత్రం మాత్రం కేవలం ఒక్క రోజులోనే జరిగే కథ అంటున్నారు. అంటే ఉదయం మొదలయ్యే సినిమా.. రాత్రి చీకటి పడే సరికి అయిపోతుందట. అలా ఒక్క రోజులోనే సినిమా స్క్రీన్ ప్లే రన్ అవుతుందని తెలుస్తోంది. అలాగే ఈ మూవీ మొదటి సగ భాగం అంతా రామ్ చరణ్ మీద సినిమా నడుస్తుందట.. అలాగే రెండో సగ భాగం మొత్తం ఎన్టీఆర్ షో కనిపిస్తుందట.

అంటే ఇంటర్వెల్ వరకూ ఒక లెక్క.. ఇంటర్వెల్ తర్వాత మరో లెక్క అన్నమాట. చివరకు క్లైమాక్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ ఇద్దరు హీరోలు ఆన్ స్క్రీన్ పై ఒకేసారి మెరుస్తారని అంటున్నారు. అంటే ఇద్దరు స్టార్లు కలిసి ఆన్ స్క్రీన్ పై ఒకే ఫ్రేములో కనిపించే సీన్ కోసం క్లైమాక్స్ వరకూ కచ్చితంగా వెయిట్ చేయాల్సిందేనని అంటున్నారు.

ఇలా ఉదయం మొదలయ్యి.. సాయంత్రం ముగిసిపోయే కథతో రీసెంట్ గా అక్కినేని అఖిల్ మూవీ హలో వచ్చింది. కంటెంట్ బాగుందనే టాక్ వచ్చినా.. రాంగ్ టైంలో రిలీజ్ చేయడంతో.. సినిమా సక్సెస్ తీరాన్ని చేరలేకపోయింది. మరి అలాంటి థీమ్ తో రాజమౌళి మూవీ అంటే మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది లెండి.