Begin typing your search above and press return to search.
అమాయకురాలు కాబట్టే 'ఆర్ ఆర్ ఆర్'కోసం అలియాని సెలెక్ట్ చేసాం..!
By: Tupaki Desk | 5 May 2020 10:52 PM ISTదర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. ఆయనకు తోడుగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించనుంది. లాక్ డౌన్ అనంతరం అలియా భట్ తో షూటింగ్ ప్రారంభిస్తారట. పూణే షెడ్యూల్‌లో అలియా టీంతో జాయిన్ కానుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. కాని కరోనా కారణంగా పూణే షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తుంది. అలియా భట్ ఇంతవరకు ఒక్కరోజు కూడా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. ఇక ఈ సినిమాతోనే అలియా తెలుగు తెరకు పరిచయం కానుంది.
ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత క్యారెక్టర్ గురించి, ఆ క్యారెక్టర్ కోసం ఎంచుకున్న ఆలియా భట్ గురించి ఈరోజు ట్వీట్ చేశారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ లో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ లేనప్పటికీ.. సీత పాత్ర సినిమాకి చాలా ముఖ్యమని తెలిపారు. ఎన్టీఆర్, రాంచరణ్ లాంటి ఇద్దరు టాలెంటెడ్ హీరోలతో పోటీపడి సీత క్యారెక్టర్ ఎమోషన్స్ పండించాలని అన్నారు. సీత అమాయకురాలు కానీ స్ట్రాంగ్ లేడీ. అంత ప్రాముఖ్యత గల పాత్ర కాబట్టే ఆలియాను ఎంపిక చేసినట్లు తెలిపారు. తన నమ్మకాన్ని నిలబెట్టే సత్తా అలియాకి ఉందని రాజమౌళి తెలపడం విశేషం. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న రిలీజ్ చేస్తామని ఇదివరకే రాజమౌళి టీమ్ ప్రకటించింది. ప్రస్తుత లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడటంతో మూవీ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.