Begin typing your search above and press return to search.
రాజమౌళికి ఎంత ముట్టిందో తెలుసా!!
By: Tupaki Desk | 30 April 2017 2:57 PM ISTబాహుబలి ది బిగినింగ్ తో భారీ సక్సెస్ సాధించిన దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి ది కంక్లూజన్ అంతకు మించిన విజయాన్ని సాధించబోతున్నాడు. మొదటి రోజుల వసూళ్లు లెక్కలు చూస్తే ఇండస్ట్రీ జనాలకు కళ్లు కుట్టేస్తున్నాయి. పైకి ప్రశంసలు కురిపిస్తున్నా.. లోపల అనేక మంది మూవీ మేకర్స్ ఈ వసూళ్లను చూసి కుళ్లుకోవడంలో ఆశ్చర్యం లేదు.
ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని తీసేందుకు రాజమౌళికి ఐదేళ్లకు పైగా సమయం పట్టింది. మరి టాప్ డైరెక్టర్ గా ఉంటూ ఇలాంటి అద్భుతాన్ని సృష్టించిన జక్కన్నకు ఎంత మొత్తం గిట్టుబాటు అయిఉంటుంది? ఇది టిపికల్ క్వశ్చన్ అనే అనాలి. ఎందుకంటే రీజనల్ సినిమాగా మొదలై అంతర్జాతీయ స్థాయికి చేరిన మూవీ బాహుబలి. కానీ మొత్తం ప్రాజెక్టు ద్వారా వచ్చిన లాభాల్లో మూడో వంతు మొత్తాన్ని ఇవ్వాలన్నది నిర్మాత- దర్శకుడి ఒప్పందంగా తెలుస్తోంది. దీంతో పాటు ఈ ఐదేళ్ల పాటు రాజమౌళికి సంబంధించిన ఖర్చుల వ్యవహారాలను కూడా నిర్మాతలే హ్యాండిల్ చేశారట.
బాహుబలి ది కంక్లూజన్ మూవీని రూ. 438 కోట్లకు అంతర్జాతీయంగా.. దేశీయంగా.. శాటిలైట్.. ఇతర హక్కులను విక్రయించారన్నది ఇండస్ట్రీ లెక్క. ఈ ఫిగర్స్ చూస్తే.. రాజమౌళికి ఎంత మొత్తం గిట్టిందనే సంగతి లెక్కేసుకోవడం పెద్ద విషయమేం కాదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/