Begin typing your search above and press return to search.
ఇంతకీ రాజమౌళికి ఎంతొస్తుంది?
By: Tupaki Desk | 21 July 2015 5:19 PM ISTకెరీర్లో ఫెయిల్యూర్ అన్నదే లేని దర్శకుడు రాజమౌళి. అంతే కాదు.. తన ప్రతి సినిమాకూ పెట్టుబడి మీద నిర్మాతకు కనీసం రెట్టింపు ఆదాయం తెచ్చిపెట్టాడు. కొన్ని సినిమాలకు పెట్టుబడి మీద మూణ్నాలుగు రెట్లు ఆదాయం కూడా వచ్చింది. తాజాగా బాహుబలి పార్ట్ 1 మీద వంద కోట్లకు పైగా పెట్టుబడి పెడితే.. దానికి రెండు మూడు రెట్లు ఆదాయం వస్తోంది. ఇలాంటి దర్శకుడికి రెమ్యూనేషన్ ఇంత అని ఫిక్స్ చేయడం చాలా కష్టం. మార్కెట్ కంటే కోటి కోటిన్నర తక్కువ తీసుకుంటున్నా అని ఆ మధ్య రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు కానీ.. గత మూడు నాలుగు సినిమాల నుంచి రాజమౌళి పారితోషకమే తీసుకోవట్లేదు.
అలాగని ఉచితంగా సినిమాలు చేస్తున్నాడని మరోలా అర్థం చేసుకోకండి. పారితోషకం బదులు లాభాల్లో వాటానే తీసుకుంటున్నాడు జక్కన్న. మర్యాద రామన్న, ఈగ సినిమాలకు ఇలాగే చేశాడు. ఇప్పుడు బాహుబలి విషయంలోనూ అదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. ఈ వాటా కూడా తన ఒక్కడికే కాదు.. ఇదో ఫ్యామిలీ ప్యాకేజీ. బాహుబలికి దర్శకుడు రాజమౌళి అయితే.. కథకుడు అతడి తండ్రి విజయేంద్ర ప్రసాద్, సంగీత దర్శకుడు కీరవాణి. రమ, శ్రీవల్లి, కార్తికేయ కూడా యూనిట్లో కీలక సభ్యులు. వీళ్లందరికీ రెమ్యూనరేషన్ అని కాకుండా ఏకమొత్తంగా లాభాల్లో వాటా ఇవ్వడానికి ఒప్పుకున్నారు నిర్మాతు శోభు, ప్రసాద్. బాహుబలి అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. తొలి పార్ట్ వరకే రాజమౌళి అండ్ ఫ్యామిలీకి తక్కువలో తక్కువ యాభై కోట్లయినా ముట్టి ఉంటుందని అంచనా. ఆ లెక్క ఇంకా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఆ ఫ్యామిలీకి వంద కోట్లు తీసుకోవడానికి కూడా అర్హత ఉంది.