Begin typing your search above and press return to search.

రాజమౌళి వచ్చినా హైప్ రావడం లేదేంటబ్బా!

By:  Tupaki Desk   |   25 Feb 2020 12:00 AM IST
రాజమౌళి వచ్చినా హైప్ రావడం లేదేంటబ్బా!
X
న్యాచురల్ స్టార్ నాని బ్యానర్ వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'హిట్'. ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్ కావడంతో ఒక సెక్షన్ ఆడియన్సుకు మాతమే కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు కుటుంబ ప్రేక్షకులు దూరంగా ఉంటారు. దీని కవర్ చెయ్యాలంటే టార్గెట్ సెక్షన్ ను మెప్పించడం ఒక్కటే దారి. అయితే ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదని టాక్ వినిపిస్తోంది.

నిన్న జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంటుకు 'బాహుబలి' టీమ్ మెంబర్స్ హాజరయ్యారు. రాజమౌళి.. రానా దగ్గుబాటి.. అనుష్క 'హిట్' ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచారు. అయితే స్వయంగా రాజమౌళి ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికే సినిమాకు హైప్ రాలేదు. మరో వైపు ఈ సినిమా సమర్పకుడు అయిన నాని 'హిట్' గురించి పెద్దగా ఏమీ మాట్లాడలేదు. దీంతో సినిమాపై ఫలితంపై పెద్దగా ఆశలు లేవనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై నెగెటివ్ టాక్ ఉందని అంటున్నారు. సినిమా విడుదలకు ఇక నాలుగురోజులే సమయం ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో జోరు చూపిస్తే ఓపెనింగ్ కలెక్షన్స్ డీసెంట్ గా ఉండే అవకాశం ఉంటుంది. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంటుకు వచ్చినప్పటికీ ఇలా హైప్ తక్కువగా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమే. సినిమా రిలీజ్ అయితే తప్ప ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందనేది తెలియదు.