Begin typing your search above and press return to search.

RRR తో యూట్యూబ్ రికార్డులన్నీ బ్రేక్ చేసేలా రాజమౌళి ప్లాన్స్..!

By:  Tupaki Desk   |   26 Oct 2021 9:04 AM GMT
RRR తో యూట్యూబ్ రికార్డులన్నీ బ్రేక్ చేసేలా రాజమౌళి ప్లాన్స్..!
X
ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమా ''ఆర్.ఆర్.ఆర్'' (రౌద్రం రణం రుధిరం). దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. యావత్ సినీ అభిమానులు ఈ మల్టీస్టారర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫైనల్ గా 2022 జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో దీపావళి నుంచి ప్రమోషన్స్ ముమ్మరం చేయాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

'ఆర్ ఆర్ ఆర్' చిత్రానికి సంబంధించి రఫ్ ఎడిట్ నిడివి దాదాపు 3 గంటలు వచ్చిందట. దీన్ని 2 గంటల 45 నిమిషాలకు కుదించాలని జక్కన్న అండ్ టీమ్ నిర్ణయించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దీపావళి నుంచి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని మేకర్స్ ప్రణాళికలు రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. నవంబర్ 4న RRR స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నారట. అక్టోబర్ 29 శుక్రవారం టీజర్ అనౌన్స్ మెంట్ రాబోతోందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన ఇద్దరు హీరోల టీజర్లు విశేష స్పందన తెచ్చుకున్నాయి. దీపావళి సందర్భంగా రాబోయే మరో టీజర్ ని తారక్ - చరణ్ ఇద్దరూ ఉండేలా కట్ చేస్తున్నారట. అయితే పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా కోసం అన్ని భాషలకు కలిపి ఒక సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. 'కేజీయఫ్ 2' టీజర్ ని ఇదే విధంగా విడుదల చేయగా.. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల 'రాధే శ్యామ్' చిత్రానికి సంబంధించి ఒకే భాషలో టీజర్ ని వదిలిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుంచి కూడా అన్ని భాషల ప్రేక్షకులకు కలిపి ఒకే టీజర్ రాబోతోందట. ఇందులో ఎలాంటి డైలాగ్స్ లేకుండా.. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. మేకర్స్ సైడ్ నుంచి టీజర్ కు సంబంధించిన కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ సింగిల్ టీజర్ తో బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద RRR విడుదలకు రెండున్నల నెలల సమయం ఉన్న నేపథ్యంలో దీపావళి నుంచి అధికారిక ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి వెరైటీ ప్రమోషనల్ స్ట్రాటజీ ఫాలో అయ్యే జక్కన్న.. ట్రిపుల్ ఆర్ కోసం సరికొత్త ప్లాన్స్ చేస్తున్నారట.

ఇకపోతే భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమాకు సంబంధించి కొన్ని ఏరియాల్లో మార్కెట్ రేట్లను సవరించారని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతంలో ఈ సినిమా మార్కెట్ విలువను పావుశాతం తగ్గించారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో టిక్కెట్ రేట్లు.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నారట. మారిన పరిస్థితుల వల్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవుతుందో లేదో అనే సందేహంతో ఆంధ్రా - సీడెడ్ - ఉత్తరాంధ్ర లలో రేట్లను కుదించారని చెబుతున్నారు. నైజాం - ఓవర్సీస్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లో మాత్రం మార్పులు లేవు. అలానే నాన్ థియేట్రికల్ డీల్స్ విషయంలో కూడా ఎలాంటి సవరణలు ఉండబోవని అంటున్నారు.

కాగా, 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా అల్లుకున్న ఫిక్షనల్ కథాంశంతో రూపొందిస్తున్నారు. ఇందులో అల్లూరిగా రామ్ చరణ్ - భీమ్ గా ఎన్టీఆర్ కనిపించనున్నారు. అలియా భట్ - ఒలీవియా మోరిస్ - అజయ్ దేవగన్ - సముద్ర ఖని - శ్రియ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.