Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం రాజమౌళి పార్టీ?

By:  Tupaki Desk   |   13 Oct 2016 4:00 PM IST
ప్రభాస్ కోసం రాజమౌళి పార్టీ?
X
రాజమౌళి విలక్షణమైన దర్శకుడు. చాలా మంది అగ్ర దర్శకుల్లో కనిపించే దర్పం అతడిలో కనిపించదు. వ్యక్తిగత జీవితంలో చాలా సింపుల్ గా ఉంటాడు జక్కన్న. మిగతా సినిమా సెలబ్రెటీల మాదిరిగా పార్టీలని.. పబ్బులని తిరగడు. ఎక్కువగా కుటుంబంతో గడపడానికే ఇష్టపడతారు. ఫ్యామిలీ చాలా పెద్దది కావడంతో అందరూ కలిస్తే చాలా సందడిగా ఉంటుంది. ఇలా ఫ్యామిలీ వేడుకలతోనే వినోదం పొందుతుంటాడు రాజమౌళి. తన సినిమాలు హిట్టయినా.. లేదా ఇంకేదైనా సందర్భం వచ్చినా రాజమౌళి పార్టీ ఇవ్వడం అన్నది ఇప్పటిదాకా సినీ జనాలు ఎవరూ చూడలేదు.

ఐతే రాజమౌళి తొలిసారి ఇండస్ట్రీ జనాలకు ఒక పెద్ద పార్టీ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడట. ఆ పార్టీ తన కోసం కాదు.. తన ‘బాహుబలి’ ప్రభాస్ కోసం. ఈ విజువల్ వండర్ కోసం దాదాపు నాలుగేళ్ల పాటు రాజమౌళితో ట్రావెల్ చేసిన ప్రభాస్.. ఈ ఏడాది ఆఖర్లో రిలీవ్ అవుతున్నాడు. దీని కంటే ముందు ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు జరగబోతోంది. ఈ సందర్భంగా ప్రభాస్ చూపించిన కమిట్మెంట్.. అతడితో తన ప్రయాణానికి గుర్తుగా ఒక పెద్ద పార్టీ ఇవ్వబోతున్నాడట రాజమౌళి. ఇందుకోసం ఏర్పాట్లు కొంచెం భారీగానే జరుగుతున్నాయి. మరోవైపు తన పుట్టిన రోజు నాడు ప్రభాస్ కూడా ఒక పెద్ద పార్టీ ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/