Begin typing your search above and press return to search.

హీరోలపై ఆంక్షలను జక్కన్న తొలగించినట్లేనా?

By:  Tupaki Desk   |   12 Jun 2020 5:40 PM IST
హీరోలపై ఆంక్షలను జక్కన్న తొలగించినట్లేనా?
X
రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటే ఎంతటి పెద్ద స్టార్‌ అయిన ఇంట్రెస్ట్‌ చూపించాల్సిందే. సంవత్సరాలకు సంవత్సరాలు జక్కన్న కోసం డేట్లు ఇచ్చేందుకు సైతం సిద్దంగా ఉంటారు. ప్రభాస్‌ బాహుబలి సినిమా కోసం దాదాపుగా నాలుగు సంవత్సరాలు రాజమౌళికి ఇచ్చేశాడు. ఇక ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్‌ రామ్‌ చరణ్‌ లు కూడా మరే సినిమాలు పెట్టుకోకుండా పూర్తిగా జక్కన్నకు ఇచ్చేశారు. సినిమా షూటింగ్స్‌ అనుకున్నట్లుగా జరగక పోవడంతో చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు చాలా నష్టపోతున్నారు.

సాదారణంగా అయితే రాజమౌళి తన సినిమా పూర్తి అయ్యే వరకు మరే సినిమాలను ఒప్పుకోవద్దని హీరోలకు ఆంక్షలు పెడతాడు. కనీసం షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు అయినా ఇతర సినిమాలకు ఒప్పుకోవద్దంటూ సూచిస్తాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా హీరోల విషయంలో కూడా అంతే ఆంక్షలు పెట్టారు. కాని ఇప్పుడు షూటింగ్స్‌ అనుకున్నట్లుగా జరగని కారణంగా ఇతర సినిమాలకు ఓకే చెప్పుకోవచ్చు అంటూ హీరోలకు పర్మీషన్‌ ఇచ్చాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ పూర్తి అవ్వడం ఈ ఏడాదిలో సాధ్యం అయ్యే విషయం కాదని యూనిట్‌ సభ్యుల టాక్‌. వచ్చే ఏడాది ఆరంభంలో షూటింగ్‌ పూర్తి చేసి జులై వరకు సినిమాను విడుదల చేయబోతున్నారు. అప్పటి వరకు హీరోలను హోల్డ్‌ లో పెట్టడం అనేది వారికి చాలా నష్టం కలిగించడం అవుతుందని అందుకే వచ్చే అక్టోబర్‌ నుండి ఇద్దరు కూడా ఇతర ప్రాజెక్ట్‌ కు ఓకే చెప్పుకుని షూటింగ్‌ కు వెళ్లవచ్చని జక్కన్న గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. దాంతో త్రివిక్రమ్‌ తో ఎన్టీఆర్‌ సినిమాకు రెడీ అవుతుండగా రామ్‌ చరణ్‌ ‘ఆచార్య’ చిత్రంలో నటించనున్నాడట. ఈసారికి రాజమౌళి హీరోల విషయంలో కాస్త మినహాయింపు ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు. జక్కన్న నిర్ణయంతో ఎన్టీఆర్‌ మరియు చరణ్‌ ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.