Begin typing your search above and press return to search.

జక్కన్న.. ఇదో పెద్ద బరువు బాబోయ్‌!

By:  Tupaki Desk   |   23 Jun 2015 3:15 PM IST
జక్కన్న.. ఇదో పెద్ద బరువు బాబోయ్‌!
X
రాజమౌళిని అందరూ జక్కన్న జక్కన్న అంటారన్న సంగతి తెలిసిందే. ఐతే ఈ పేరు ఆయనకు ఎందుకొచ్చిందన్నది చాలామందికి తెలియదు. చాలామంది వరుసగా హిట్లు కొట్టాక రాజమౌళికి ఎవరో ఈ బిరుదు తగిలించి ఉంటారనుకుంటారు. కానీ దర్శకుడిగా ఒక్క సినిమా కూడా తీయకముందే రాజమౌళికి 'జక్కన్న' అనే బిరుదు వచ్చిందని తెలిసింది కొద్దిమందికే.

ఆ సంగతేంటో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు రాజమౌళి. ''మా గురువుగారు రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం సీరియల్‌కు దర్శకత్వం వహించాను. సీరియల్‌ను కూడా సినిమాలా చెక్కుతున్నానని అందులో నటించిన నా మిత్రుడు రాజీవ్‌ కనకాల సరదాగా జక్కన్న అనడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తారక్‌తో సినిమాలు చేస్తున్నపుడు 'జక్కన్న'ను బాగా పాపులర్‌ చేశాడు. తర్వాత అందరూ అలా అనడం మొదలుపెట్టారు. ఐతే 'జక్కన్న' అనే మాటను చాలా పెద్ద బరువుగా భావిస్తాను'' అని చెప్పాడు రాజమౌళి.

ఐతే కెరీర్‌ మొదట్లో రాజమౌళిని జక్కన్న అంటుంటే అదోలా అనిపించింది కానీ.. తన కష్టాన్ని నమ్ముకుని సినిమా సినిమాకూ ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన రాజమౌళిని 'జక్కన్న' అని పిలవడానికి ఎవ్వరూ కూడా సందేహించట్లేదు.