Begin typing your search above and press return to search.

మహాభారతం ముందు ఇది చిన్న సబ్జెక్ట్

By:  Tupaki Desk   |   12 Nov 2015 7:30 AM GMT
మహాభారతం ముందు ఇది చిన్న సబ్జెక్ట్
X
ఆ మహా గ్రంధాన్ని సినిమాగా తీయడానికి చాలా వర్క్ చేయాలి. బాహుబలి తర్వాత మహాభారతం తీస్తారా అని అడిగితే ఇదీ రాజమౌళి ఆన్సర్. జక్కన్న సమాధానం కాస్త స్టయిల్ చెప్పాడు కానీ.. మహాభారతం ముందు ఏ సబ్జెక్ట్ అయినా చిన్నదే. అన్ని పాత్రలు - వేరియేషన్స్ తో మరే గ్రంధం ఉండదు. ఇప్పుడు దీన్ని తీయడానికి ఎక్కువ టైం కావాలంటాడు రాజమౌళి. నిజమే అనిపిస్తుంది కానీ.. మహాభారతం రెడీమేడ్ స్టోరీ. స్క్రిప్ట్ తప్ప.. స్టోరీపై కుస్తీపట్టాల్సిన అవసరం ఉండదు. బాహుబలికి ముందు మూదేళ్లు కేటాయించాల్సి వచ్చింది కానీ.. మహాభారతం ప్రారంభించాలడానికి అంత టైం పట్టదు.

అసలు ఆ గ్రంధాన్ని తెరకెక్కించాలంటే ముందు కావాల్సింది నటీ నటులు. అంతమందిని తీసుకుని ఒప్పించి తెరకెక్కించగలగాలి. కాకపోతే ఇక్కడో సమస్య ఉంది. అది రాజమౌళితోనే. ఆయన మసాలా ఎలిమెంట్స్ పై పెట్టిన కాన్సంట్రేషన్ స్టోరీపై ఉంచడన్నది వాస్తవమే. కొన్ని సీన్స్ ని చూసేవాళ్ల రక్తం మరిగేలా తీస్తాడు జక్కన్న. అలాంటివి మహాభారతంలో బోలెడు ఉంటాయి కాబట్టి.. ఆ గ్రంధం ఆకర్షించచ్చు ఆయన్ని. మరి ఇంత మహా కథను నేరేట్ చేయడంలో.. ఒక సినిమా సరిపోదన్నది వాస్తవమే. మరి ఓ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాగా ఒకటి రెండు ట్రయాలజీలు తీయాల్సి రావచ్చు. అలాగని ఒక్కో మూవీకి రెండేళ్లు తీసుకుంటామంటే కుదరదు. కనీసం ఏడాదికో పార్ట్ అయినా తెరపైకి తేవాలి.

ఇంతగా చేయాలంటే ఖచ్చితంగా హాలీవుడ్ టీం రంగంలోకి దిగాల్సిందే. అప్పుడు ప్రొడక్షన్ యూనిట్లు పెరుగుతాయి. ఖర్చు పెరుగుతుంది. కానీ మన మహాగ్రంధమైన మహాభారతం గురించి ప్రపంచానికి తెలుస్తుంది. ఈ సంగతులేవీ చెప్పకుండా టైం పడుతుంది. బాహుబలి చిన్నది అంటే ఎలా జక్కన్నా.. తీస్తావో తియ్యవో క్లారిటీ ఇచ్చెయ్. నువ్వే సమర్ధుడివి అనే కదా ఇంతమంది అడుగుతున్నారు.. ఆలోచించు