Begin typing your search above and press return to search.
బాహుబలికి ఖర్చు పెట్టింది అంతేనా
By: Tupaki Desk | 22 Dec 2015 4:00 AM ISTతెలుగు సినిమా చరిత్రని తిరగరాసేసి, బాహుబలి ది బిగినింగ్ తో తను తప్ప ఎవరూ అందుకోలేనన్ని రికార్డులు సృష్టించాడు దర్శకధీరుడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ కేవలం థియేటర్లలోనే 600 కోట్ల రూపాయల పైగా వసూళ్లను సాధించి, ఇప్పుడా రికార్డును బద్దలుకొట్టేలా సెకండ్ పార్ట్ ని సిద్ధం చేస్తున్నాడు. మరి బాహుబలి కోసం జక్కన్న పెట్టించిన ఖర్చెంత ?
అంత భారీ చిత్రానికి బోలెడు ఖర్చని చాలా రకాల న్యూస్ వచ్చాయి. మొదటి రెండు భాగాలకు కలిసి 250 కోట్లు అనుకున్నారని, బాహుబలి ఫస్ట్ పార్ట్ కే 150 కోట్లి పైగా ఖర్చయిందని న్యూస్ వినిపించాయి. ఖర్చులు అందుకునేందుకు ప్రీ రిలీజ్ బిజినెస్ 130 కోట్లు చేశారని, మిగిలినది శాటిలైట్ రైట్స్ లో ప్లాన్ చేశారని కూడా కొన్ని వార్తలున్నాయి. మరి ఇంతకీ రాజమౌళి చేసిన అసలు ఖర్చెంత ? ఇప్పుడా విషయాన్ని తనే స్వయంగా చెప్పాడు ఈ దర్శకధీరుడు.
బాహుబలి విజువల్ ఎఫెక్ట్స్ కోసం 22 కోట్లు మాత్రమే ఖర్చయిందట. సినిమా మొత్తం గ్రాఫిక్స్ మీద బేస్ అయింది బాహుబలి. ఆ మూవీ ఔట్ పుట్ ప్రకారం, ఈ ఖర్చు చాలా తక్కువ అనే చెప్పాలి. రెండేళ్లకుపైగా దాదాపు 400 రోజులు షూటింగ్ జరుపుకోవడంతో.. నిర్మాణ ఖర్చు 15 కోట్లు అవుతుంది. అలాగే తొలి భాగం కోసం రాజమౌళి రెమ్యూనరేషన్ గా 20 కోట్లు తీసుకున్నాడు. ఇది మ్యూజిక్, కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా కలిపిన ప్యాకేజ్ అనే విషయం గుర్తుంచుకోవాలి.
వేరే సినిమా యాక్సెప్ట్ చేయకుండా ఇంత సుదీర్ఘంగా కాల్షీట్స్ ఇచ్చినందుకు ప్రభాస్ కు 20 కోట్లు చెల్లించారు. అనుష్క, తమన్నా, రాణా, రమ్యకృష్ణ, నాజర్ సహా.. మిగిలిన తారాగణం మొత్తానికి కలిపి 10 కోట్ల లోపే ముట్టచెప్పినట్లు భోగట్టా. సినిమాటోగ్రఫీ, సౌండ్ డిజైనర్, స్టంట్ కొరిగ్రాఫర్, మేకప్, ఇతర టెక్నికల్ టీంకు 5 కోట్ల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాస్టూమ్స్, ఇతర మెటీరియల్ కు 10 కోట్లు వెచ్చించినా, ప్రీ-పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు 10 కోట్లు, పబ్లిసిటీకి 2 కోట్ల బడ్జెట్ తో కలిపితే మొత్తం ఎంతవుతుందో తెలుసా?
మొత్తం బాహుబలికి అయ్యే ఖర్చు 107 కోట్లు మాత్రమే. దీనికి ఇతర ఖర్చులన్నీ కలుపుకున్నా.. 115 కోట్ల రూపాయల్లోపే బాహుబలి ఫినిష్ అయిపోయింది. తొలిభాగానికి ఉన్న పరిమితులు ఇప్పుడు లేకపోవడంతో.. ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కోసం ఎక్కువే ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి. పైగా ఆ తొలి భాగం బడ్జెట్ లోనే 40% బాహుబలి 2 కూడా పూర్తయ్యింది. సో.. ఇంకో 50 కోట్లలో పార్టు 2 చుట్టేసినా.. నిర్మాతలకు భారీ లాభాలే.