Begin typing your search above and press return to search.

బాహుబలి క్లోజింగ్ కి స్టార్టింగ్ డేట్

By:  Tupaki Desk   |   11 Nov 2015 3:58 AM GMT
బాహుబలి క్లోజింగ్ కి స్టార్టింగ్ డేట్
X
బాహుబలి ది బిగినింగ్ ని ప్రపంచదేశాలన్నిటిలోనూ రిలీజ్ చేసి, ఇండియా బిగ్గెస్ట్ మూవీగా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్న దర్శకధీరుడు రాజమౌళి.. రెండో భాగం ప్రారంభానికి డేట్ ఫైనల్ చేశాడు. బాహుబలి ది కంక్లూజన్ పేరుతో తెరకెక్కనున్న ఈ భాగం షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు జక్కన్న.

తొలిభాగం షూటింగ్ తో పాటే.. రెండో భాగానికి సంబంధించిన టాకీ పార్ట్ లో 40 శాతాన్ని పూర్తి చేశారు. ఇప్పుడు మిగిలిన 60శాతంను వేగంగా పూర్తి చేసి, వీలైనంత త్వరగా గ్రాఫిక్ వర్క్ పైకి వెళ్లేందుకు రాజమౌళి సిద్ధమవుతన్నాడు. ఇందుకోసం డిసెంబర్ 14న బాహుబలి ది కంక్లూజన్ షూటింగ్ ను ప్రారంభించనున్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది దర్శకుడి లక్ష్యం.

బాహుబలి అంచనాలకు మించి సక్సెస్ కావడంతో.. ఇప్పుడు చివరిదైన రెండో భాగంపై ఎక్కువ దృష్టి పెట్టాడు దర్శకధీరుడు. భారతీయ సినీ చరిత్రలోనే బాహుబలి2 ద్వారా కొత్త చరిత్ర సృష్టించాలన్నది ఆలోచన. మొదటి భాగంతో 600 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టగా.. సీక్వెల్ ద్వారా వెయ్యి కోట్ల టార్గెట్ పై కన్నేశాడు రాజమౌళి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు.. సాంకేతిక వర్గంలో కూడా కీలక మార్పులను ఇప్పటికే ప్రకటించింది యూనిట్. ఇప్పటికే ప్రధాన నటవర్గమంతా సిద్ధం కాగా.. త్వరలో దేవసేన పాత్రధారి అనుష్క కూడా యూనిట్ కు జత కానుంది.