Begin typing your search above and press return to search.

మ‌హాభార‌తంపై రాజ‌మౌళి మ‌రోసారి..

By:  Tupaki Desk   |   9 Jan 2017 2:00 PM GMT
మ‌హాభార‌తంపై రాజ‌మౌళి మ‌రోసారి..
X
మ‌హాభార‌త క‌థ‌ను తెర‌కెక్కించ‌డం త‌న చిర‌కాల వాంఛ అని మ‌రోసారి నొక్కి వ‌క్కాణించాడు రాజ‌మౌళి. దీంతో పాటు ‘బాహుబ‌లి’కి సంబంధించిన అనుభ‌వాల‌పై సౌత్ కాంక్లేవ్ 2017 కార్య‌క్ర‌మంలో కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు జ‌క్క‌న్న‌. అక్క‌డ రాజ‌మౌళి చేసిన కొన్ని ముఖ్య‌మైన కామెంట్లు ఇవీ..

‘‘సినిమాకు సంబంధించి నేనేదైనా విజువ‌లైజ్ చేస్తే ముందు నాక‌ది ఎగ్జైటింగ్ గా అనిపించాలి. ప్రేక్ష‌కుల సంగ‌తి త‌ర్వాత‌’’

‘‘30 ఏళ్ల త‌ర్వాత కూడా జ‌నాలు బాహుబ‌లి ప్ర‌భావాన్ని గుర్తుంచుకోవాలన్న‌ది నా కోరిక‌’’

‘‘ఒక ద‌ర్శ‌కుడిగా నా సినిమా విజువ‌ల్స్ విష‌యంలో ఏ ఒక్క సంద‌ర్భంలోనూ నేను కాంప్ర‌మైజ్ కాను’’

‘‘మ‌హాభార‌త క‌థ‌ను ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌నంత భారీ స్థాయిలో తీయాల‌న్న‌ది నా చిర‌కాల వాంఛ‌’’

‘‘మ‌హాభార‌త క‌థ‌లోంచి ఒక పాత్ర తీసుకున్నా.. ఒక ఉప‌క‌థ‌ను ఎంచుకున్నా అది న‌న్ను ఎంత‌గానో క‌దిలిస్తుంది’’

‘‘ఒరిజినాలిటీ విష‌యంలో నాకు పెద్ద‌గా క్రెడిట్స్ రావు. అమ‌ర్ చిత్ర క‌థ‌ల నుంచే నేను ఎక్కువ‌గా స్ఫూర్తి పొందాను’’

‘‘భాష ఒక బంధ‌నం అని నేనెప్పుడూ భావించ‌ను. విజువ‌ల్సే స‌రైన క‌థ‌ను.. ఎమోష‌న్ల‌ను చెబుతాయి’’

‘‘ఫ‌లానా ప్రాంతం వాళ్లు ఫ‌లానా జాన‌ర్ సినిమాలే చూస్తారు అనే అభిప్రాయానికి నేను పూర్తి వ్య‌తిరేకిని’’

‘‘బాహుబ‌లి-2 పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కోసం చాలా ఎగ్జైటింగా ఎదురు చూస్తున్నా’’

‘‘బాహుబ‌లి లాంటి సినిమా చేయ‌డానికి ముందు నా సినిమాల‌న్నింటి నుంచి నేను ఎంతో నేర్చుకుంటూ వ‌చ్చాను. అవే న‌న్ను ఇంత భారీ సినిమా తీసేలా చేశాయి’’

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/